Home General ఆకట్టుకుంటోన్న శానిటైజర్ వినాయకుడు.. కరోనా ఖతం అంటోన్న జనం!

ఆకట్టుకుంటోన్న శానిటైజర్ వినాయకుడు.. కరోనా ఖతం అంటోన్న జనం!

Sanitizer Ganesh Idols Attracts Public

ప్రతియేటా వినాయక చవితి పండుగను ప్రజలు భక్తిశ్రద్ధలతో చాలా ఘనంగా నిర్వహించుకుంటారు. ఇక యువకులు తమ వీధిలో వినాయకుడికి మండపం ఏర్పాటు చేసి వివిధ ఆకారాల గణనాథులను ప్రతిష్ట చేస్తుంటారు. నవరాత్రుల పాటు పూజలు చేసి ఆ మూర్తులను భారీ ఎత్తున ఊరేగింపుగా తీసుకెళ్లి నిమజ్జనం చేస్తుంటారు. అయితే వివిధ ఆకారాల్లో, వివిధ సైజుల్లో లంబోదరడు మనకు దర్శనమిస్తుండటంతో ఈ పండుగ వాతావరణం మనందరికీ తెగ నచ్చేస్తుంటోంది.

కాగా ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా పలు రాష్ట్రాల్లో గణేష్ మండపాలు ఏర్పాటు చేయకూడదనే ఆర్డర్లు జారీ అయ్యాయి. అయితే ఇంట్లోనే వినాయకుడి ప్రతిమ పెట్టుకుని పూజలు చేసుకోవాలని ప్రభుత్వం అంటోంది. దీంతో ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు అద్దం పట్టే వినాయకుడి ప్రతిమను ఓ కళాకారుడు తయారు చేశాడు. ఈ వినాయకుడి ప్రత్యేకత ఏమిటంటే, మన చేతులను వినాయకుడి విగ్రహం దగ్గర పెడితే, సెన్సార్ ద్వారా శానిటైజర్ మన చేతిలో పడుతుంది. ముంబైకి చెందిన డిజైనర్ రామ్‌దాస్ చౌదరి అనే వ్యక్తి కరోనా వైరస్ రాకుండా ఉండేందుకు శానిటైజర్ గణేశ విగ్రహాలను తయారు చేశారు.

ఈ విగ్రహాలు అందరి చూపులను ఆకట్టుకోవడం ప్రజలు ఈ విగ్రహాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని రామ్‌దాస్ అంటున్నాడు. తనకు ఇలాంటి విగ్రహాలు తయారు చేయాల్సిందిగా భారీ ఆర్డర్లు వస్తున్నాయని అతడు అంటున్నాడు. ఏదేమైనా కరోనా సోకకుండా చేసేందుకు ఆశీస్సులతో పాటు కాస్త శానిటైజర్ కూడా ఇస్తున్నాడు ఈ వినాయకుడు.

सॅनिटायझर बाप्पा पाहिलात का? | Artist makes sanitizer Ganesha idols | Maharashtra Times
- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad