Home General ఓదార్పే ఉపాధి.. ఏడాదికి రూ.28 ల‌క్ష‌ల ఆదాయం..!

ఓదార్పే ఉపాధి.. ఏడాదికి రూ.28 ల‌క్ష‌ల ఆదాయం..!

అమ్మా, నీవు ఇలా ద‌గ్గ‌ర‌కు తీసుకున్న‌ప్పుడ‌ల్లా… ఎంతో హాయిగా ఉంటుంది. చిన్న‌ప్పుడు నాన్న కొట్టి ఏడుస్తుంటే నీవు ఇలాగే ద‌గ్గ‌ర‌కు తీసుకునే దానివి. అప్పుడు ఆ బాధ అంతా పోయేది. జ‌ంత‌ర్ మంత‌ర్ ఛూమంత‌ర్ ఖాళీ.. అంద‌ర్ ద‌ర‌ద్ దెబ్బ‌కు ఖాళీ అని నీవు చెప్పే ఆ మాట నా బాధ‌నంత‌టిని దూరం చేసేది. అంటూ శంక‌ర్‌దాదా ఎంబీబీఎస్ మూవీలో మెగాస్టార్ చిరంజీవి చెప్పిన మాట‌లు గుర్తున్నాయా..? బొమ్మ సూప‌ర్ డూప‌ర్ హిట్ అయ్యాక ఆ మాత్రం గుర్తుండ‌క చ‌స్తాయా..! అని అంటారా…? నిజమే మ‌రీ..! ఆ మూవీలో చిరంజీవిని ఓదారుస్తూ త‌ల్లి చెప్పే మాట‌లు.. ఓన్లీ చిరంజీవికే కాక సినిమా చూస్తున్న వాళ్ల‌కు కూడా ఓద‌ర్పునిచ్చాయంటే న‌మ్మ‌శ‌క్యం కాదేమో మ‌రీ..!

ఇప్పుడు అదే ఓదార్పును అమెరికా క‌న్సార్‌కు చెందిన రాబిన్ స్టినే ఉపాధిగా మార్చుకుంది. ఆ ఇంగ్లీషు పాప శంక‌ర్ దాదా ఎంబీబీఎస్ సినిమాను చూసి ప్రేర‌ణ పొందిందో..! లేదో..! అస‌లేం జ‌రిగిందో తెలీదు కానీ..కుటుంబ క‌ల‌హాల నేప‌థ్యంలో, జీవితంపై విర‌క్తితో, ఆఫీసు ఒత్తిళ్లు, మానసిక రోగాలు, ఇలా ఎలాంటి స‌మ‌స్య‌తోనైనా బాధ‌ప‌డుతూ ఓదార్పు కోరుకునే వారికి తానున్నాన‌ని, త‌న వ‌ద్ద‌కు వ‌స్తే జీవితంపై ఆశ క‌ల‌గ‌డంతోపాటు, అంత‌కు ముందున్న స‌మ‌స్య‌ల‌న్నిటినీ మ‌రిచిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారంటూ చెప్పుకొస్తుంది.

అదేంటి..! రాబిన్ స్టినే అంటే అమ్మాయి పేరు క‌దా..! ఓన్లీ అమ్మాయిల‌కేనా ఓదార్పు అనుకుంటే మీరు పప్పులో కాలేసిన‌ట్టే. త‌న వ‌ద్ద‌కు అమ్మాయిల‌తోపాటు అబ్బాయిలు, వృద్ధులు, చివ‌ర‌కు చిన్న పిల్ల‌లు ఇలా ఏ మాత్రం వ‌యో బేధం లేకుండా ఎవ‌రైనా త‌న వ‌ద్ద‌కు రావొచ్చ‌ని ఓపెన్ ఆఫ‌ర్ ఇస్తోంది. అంద‌రికీ త‌న ఓదార్పును సర‌స‌మైన ధ‌రకే ల‌భిస్తుంద‌ని పోస్ట‌ర్ల‌ను కూడా రాబిన్ స్టినే అమెరికా అంత‌టా అంటించేసింది. ఈ ఓదార్పు కాన్సెప్ట్‌ను వృత్తి ప‌రంగానే కాకుండా, సామాజిక బాధ్య‌త‌గా తాను ఫీల‌వుతున్నాన‌ని రాబిన్ స్టినే చెబుతోంది. ఇలా రాబిన్ స్టినే త‌న వ‌ద్ద‌కు వ‌చ్చే వారి నుంచి గంట‌కు రూ.5,630లు వ‌సూలు చేస్తూ ఏడాదికి రూ.28 ల‌క్ష‌లు సంపాదిస్తుంద‌ని అమెరికా జ‌నాల టాక్‌.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad