Home General ఎలుక చేసిన నిర్వాకం.. కోటి రూపాయలు స్వాహా!

ఎలుక చేసిన నిర్వాకం.. కోటి రూపాయలు స్వాహా!

Rat Reason For Rs 1 Cr Fire Accident

ఎలుకలను చూస్తే ఒక్కోసారి మనుష్యులు ఉలిక్కిపడి భయపడుతుంటారు. కొంతమంది వాటిని లెక్క కూడా చేయరు. అయితే ఎలుక తల్చుకుంటే ఏదైనా చేస్తుంది. ఇంటికి కన్నం వేయడం, నోటికి దొరికిందల్లా కొరుతూ ఇంట్లో తిరిగే ఎలుకలు కోట్లలో నష్టం కలిగిస్తాయని మీకు తెలుసా? అవును.. మీరు చదివింది నిజమే. ఎలుకలు కోట్ల ఆస్తిని అగ్నికి ఆహుతి చేసిన ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. అయితే ఇది జరిగి ఆరునెలలకు పైగానే అయ్యింది.

ఈ ఏడాది ఫిబ్రవరి 8వ తేదీన ముషీరాబాద్‌లోని మిత్రా మోటార్స్ అనే ఓ కార్ సర్వీస్ సెంటర్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అయితే కరెంట్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్నిప్రమాదం జరిగిందని అందరూ అనుకున్నారు. కానీ ట్రూత్ ల్యాబ్స్ ఫోరెన్సిక్ సంస్థ ఈ ప్రమాదానికి సంబంధించిన కారణాలు క్షుణ్ణంగా పరిశీలించగా వారికి దిమ్మతిరిగే నిజం కనిపించింది. ఆ కార్ సర్వీస్ సెంటర్‌లో ఓ ఎలుక చేసిన నిర్వాకం వల్లే ఈ అగ్నిప్రమాదం జరిగిందని సీసీటీవీ ఫుటేజీలో కనిపించింది.

ఓ ఉద్యోగి పూజ కోసం ఉదయం వెలిగించిన దీపం, రాత్రి వరకు వెలుగుతూనే ఉంది. అయితే దాన్ని ఎవరూ పట్టించుకోకపోవడంతో, రాత్రి సమయంలో ఎలుక ఆ దీపాన్ని కిందపడేసింది. దీంతో ఫర్నీచర్‌కు మంటలు చెలరేగడంతో మూడు కార్లు కూడా అగ్నికి ఆహుతయ్యాయి. ఇక అగ్నిప్రమాదం జరిగిన ఆరు నెలల తరువాత ఎలుకను దోషిగా తేల్చడంతో అందరూ అవాక్కవుతున్నారు. ఎలుక కొంప కొల్లేరు చేయడం అంటే ఇదేనేమో!

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad