Home General బాత్‌రూమ్‌లో ఉండ‌గా.. కొండ చిలువ వ‌చ్చి..!

బాత్‌రూమ్‌లో ఉండ‌గా.. కొండ చిలువ వ‌చ్చి..!

ఆస్ట్రేలియా వ్యాప్తంగా పెరుగుతున్న ఉష్టోగ్ర‌త‌ల‌తో అక్క‌డి ప్ర‌జ‌లే కాక‌, మూగ జీవాలు సైతం త‌ట్టుకోలేక‌ పోతున్నాయి. సూర్యుడి ప్ర‌తాపానికి మూగ‌జీవాల‌న్నీ అడ‌విని వ‌దిలి జ‌నావాసాలబాట ప‌డుతున్నాయి. మండుతున్న ఎండ‌ల‌తో చ‌ల్ల‌టి ప్రాంతాల‌ను ఆశ్ర‌యించే మ‌నుషుల్లానే మూగ జీవాలు కూడా ఎయిర్ కండీష‌న‌ర్ల‌ను ఆశ్ర‌యిస్తున్నారు. ఆ క్ర‌మంలోనే ఇటీవ‌ల ఓ పాము ఏకంగా ఓ ఇంట్లోని ఎయిర్ కండీష‌న‌ర్‌లో ద‌ర్శ‌న‌మిచ్చిన సంగ‌తి తెలిసిందే. ఆ ఉదంతాన్ని మ‌రువ‌క‌ముందే ఆస్ట్రేలియా క్వీన్ ల్యాండ్‌లో మ‌రో సంఘ‌ట‌న చోటు చేసుకుంది.

క్వీన్ ల్యాండ్‌కు చెందిన ఓ వ్య‌క్తి ఉద‌యం నిద్ర‌లేవ‌గానే త‌న కాల‌కృత్యాల తీర్చుకునే క్ర‌మంలో త‌న ఇంట్లోని బాత్‌రూమ్‌కు వెళ్లాడు. అదే స‌మ‌యంలో స్నానం చేసే గ‌దిలో ష‌వ‌ర్ కింద సేద తీరుతున్న కొండ చిలువ‌ను చూసి షాక‌య్యాడు. దీంతో వెంట‌నే కొండ‌చిలువ‌ల‌ను ప‌ట్ట‌డంలో అనుభ‌వం ఉన్న ల్యూకె హుంట్లేకు స‌మాచారం అందించాడు.

కొండ చిలువ తిష్ట వేసిన బాత్‌రూమ్‌కు చేరుకున్న ల్యూకె హుంట్లే ఎంతో చాక‌చ‌క్యంగా దాన్ని ప‌ట్టుకున్నాడు. అనంత‌రం ల్యూకె హుంట్లే మీడియాతో మాట్లాడుతూ.. నేను కొండ చిలువ‌ను ప‌ట్టుకునే ప‌నిలో ఉంటే.. అది మాత్రం ష‌వ‌ర్‌ను తిప్పే ప‌నిలో ఉంద‌ని, ఆరుబ‌య‌ట ఉష్ణోగ్ర‌త‌లు పెరిగి నీరంతా ఆవిరైపోతున్న క్ర‌మంలో దాహం వేసి నీళ్లు దాగుదామ‌ని ష‌వ‌ర్ రూమ్‌కు వ‌చ్చి ఉండొచ్చంటూ ల్యూకె హుంట్లే మీడియాతో చెప్పుకొచ్చాడు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad