Home General అమర జవాన్ భార్యకు అవమానం : కొడుకు లాంటి మరిదిని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి

అమర జవాన్ భార్యకు అవమానం : కొడుకు లాంటి మరిదిని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి

డబ్బు కోసం మనిషి ఎంత నీచనికైనా దిగజారుతాడు అని మరోసారి ప్రూవ్ అయ్యింది. కేవలం కోడలుతో పాటు, డబ్బు కూడా పోతుందే అనే ఒకేఒక కారణంతో కొడుకుతో సమానమైన మరిదిని పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తున్నారు ఓ అమర జవాన్ తల్లిదండ్రులు. కొడుకు దేశంకోసం ప్రాణాలు ప్రాణాలు త్యాగం చేస్తే.. వీళ్ళుమాత్రం విరాళాల ద్వారా వస్తున్న డబ్బుకు ఆశపడి కోడలు జీవితాన్నే నాశనం చేయాలని చూశారు.

అసలు విషయానికి వస్తే.. ఫిబ్రవరి 14వ తేదీన పుల్వామా ఉగ్రదాడిలో కర్ణాటక మండ్యాకు చెందిన జవాన్‌ “H గురు” వీర మరణం పొందిన సంగతి తెలిసిందే. ఈ విషాదంతో ఆయన భార్య కళావతి(25) తీవ్ర దుఃఖసాగరంలో మునిగిపోయారు. అమరుడైన భర్తకు కన్నీటి నివాళులర్పించారు ఆమె. ఇదిలాఉంటే జవాన్ “గురు” అంత్యక్రియలు ముగిసిన కొద్ది రోజులకె ఆ కుటుంబంలో విభేదాలు తలెత్తాయి. అందుకు కారణం డబ్బు అయ్యింది.

పుల్వామ దాడిలో వీరమరణం చెందిన అమర జవాన్లకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నష్ట​పరిహారం ప్రకటించాయి. అంతేకాకుండా భారత ప్రజలు కూడా పెద్ద ఎత్తున విరాళాలు అందచేశారు. ఆ మొత్తం గురు భార్య కళావతి కె చెందుతాయి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక కళావతి వయసు 25 ఏళ్ళే కాబట్టి మరోపెళ్ళి చేసుకునే అవకాశం ఉంది అని భావించిన “గురు” తల్లిదండ్రులకు ఒక నీచమైన ఆలోచన వచ్చింది.

అంత డబ్బు కోడలుకే వెళ్లిపోతుంది అని భయపడిన ఆ అత్త, మామలు ఒక పథకం వేశారు. బయటకు డబ్బుకోసమే అని చెప్పకుండా.. మా రెండో అబ్బాయిని పెళ్లి చేసుకోని ఇక్కడే ఉండు.. పెళ్లి చేసుకోకుండా మాఇంట్లో ఉంటే నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుతారు అని నమ్మబలికే ప్రయత్నం చేశారు. కానీ కళావతి మాత్రం కొడుకు లాంటి మరిదిని నేను పెళ్లిచేసుకోవడం ఏంటి ? అయిన నా భర్త చనిపోయాడని బాదలో ఉంటే మీ సమస్య ఏంటి ? అని ఎదురు తిరిగింది.

దాంతో ఆమెను బెదిరించడం మొదలు పెట్టింది ఆ కుటుంబం. పెళ్లి చేసుకుంటావా లేదా ? లేదంటే చంపేస్తాం అనే స్థాయికి దిగజారారు. దాంతో చేసేదిలేక కళావతి పోలీసులను ఆశ్రయించింది. కానీ ఈ విషయంలో వారిపై కేసు నమోదు చేస్తే అమరవీడు “గురు”ను అవమానించినట్లు అవుతుంది అని భావించిన పోలీసులు.. ఇంటికి వెళ్ళి గురు తల్లిదండ్రులను హెచ్చరించారని తెలుస్తుంది. ఇదిలాఉంటే బుధవారం మండ్యాలో పర్యటించిన కర్ణాటక CM “కుమారస్వామి” జవాన్ గురు భార్య, కళావతికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad