Home General పొల్యానా దెబ్బ‌.. ఆ దొంగ అబ్బా : జీవితంలో చూడ‌ని రుచి చూపించింది...

పొల్యానా దెబ్బ‌.. ఆ దొంగ అబ్బా : జీవితంలో చూడ‌ని రుచి చూపించింది భ‌య్యా..!

ఇటీవ‌ల కాలంలో సెల్ప్ సెక్యూరిటీ పేరుతో త‌ల్లిదండ్రుల‌తోపాటు, పాఠ‌శాల‌ల్లో, క‌ళాశాల‌ల్లో విద్యార్థినుల‌కు పాఠాల‌ను బోధిస్తున్న సంగ‌తి తెలిసిందే. దీంతో విద్యార్థినులు, యువ‌తుల్లో మ‌నోధైర్యం పెంపొంద‌డ‌మే కాకుండా, స‌మ‌స్య‌ల‌ను ఒంట‌రిగా ఎదుర్కొనే శ‌క్తి వారికి ల‌భిస్తోంది. ఇలాంటి సామాజిక కార్య‌క్ర‌మాల‌ను సైతం ప్ర‌భుత్వాలు వేగ‌వంతం చేశాయి. సెల్ప్ సెక్యూరిటీ పేరుతో ప్ర‌త్యేక శిబిరాల‌ను నిర్వ‌హిస్తూ అవ‌గాహ‌న క‌ల్పిస్తోంది.

అలాంటి సెల్ఫ్‌ సెక్యూరిటీలో శిక్ష‌ణ పొందిన ఓ యువ‌తి త‌న వ‌ద్ద ఉన్న డ‌బ్బును దోచుకునేందుకు వ‌చ్చిన ఓ దొంగ‌ను త‌న‌దైన స్టైల్లో ఫైట్ చేసి మ‌రీ పోలీసుల‌కు ప‌ట్టించింది. ఇక అస‌లు విష‌యానికొస్తే, బ్రెజిల్‌కు చెందిన పొల్యానా వియ‌నా బుధ‌వారం నాడు షాపింగ్ చేసేందుకు ఇంటి నుంచి బ‌య‌ల్దేరింది. ప్ర‌యాణం కోసం ఊబ‌ర్ క్యాబ్‌ను బుక్ చేసుకుంది. ఊబ‌ర్ క్యాబ్ కోసం ఇంటి బ‌య‌ట ఎదురు చూస్తున్న స‌మ‌యంలో ఓ వ్య‌క్తి పొల్యానా వ‌ద్ద‌కు వ‌చ్చి అంద‌రిలానే టైమ్ అడిగాడు. పొల్యానా టైమ్ చెప్పినా ఆ వ్య‌క్తి అక్క‌డ్నుంచి క‌ద‌ల్లేదు.

దీంతో అత‌నిపై అనుమాన‌ప‌డిన పొల్యానా త‌న చేతిలో ఉన్న సెల్‌ఫోన్‌ను బ్యాగ్‌లె పెట్టేందుకు య‌త్నించింది. వెంట‌నే ఆ ప‌క్క‌నే ఉన్న దొంగ అప్ర‌మ‌త్త‌మై పొల్యానాను త‌న వ‌ద్ద ఉన్న గ‌న్‌తో బెదిరించాడు. నీ బ్యాగులో ఉన్న క్యాష్‌తో స‌హా నీ చేతిలో ఉన్న ఫోన్‌ను తీసి వెంట‌నే నాకిచ్చేయ్‌.. లేదంటే ఇక్క‌డే చ‌చ్చిపోతావ్ అంటూ బెదిరించ‌సాగాడు.

అస‌లే సెల్ప్ సెక్యూరిటీలో భాగంగా మార్ష‌ల్స్ ఆర్ట్స్‌లో శిక్ష‌ణ పొందిన పొల్యానా త‌న పంచ్‌ల రుచి చూపించేందుకు ఓ దొంగ దొరికాడ‌ని భావించింది. అనుకున్న‌దే త‌డ‌వుగా ఆ దొంగ‌కు మార్ష‌ల్ ఆర్ట్స్‌లోని అన్ని పంచ్‌ల‌ను రుచి చూపించింది. మ‌డ‌త‌పెట్టి ఖాజా చేసిన‌ట్టుగా అన్ని పంచ్‌లు ఇచ్చిన త‌రువాత దొంగ‌ను ఓ మూల కూర్చోబెట్టి పోలీసుల‌కు స‌మాచారం అందించింది. పోలీసులు వ‌చ్చి ఆ దొంగ‌ను స్టేష‌న్‌కు కాకుండా, ఆస్ప‌త్రికి తీసుకెళ్లారు. పొల్యానా దెబ్బ‌.. దొంగ అబ్బా అనేలా ఇచ్చిన పంచ్‌ల‌కు ఆస్ప‌త్రికి కాకుండా ఇంకెక్క‌డికి పోతాడు. పోలీసులు రావ‌డం ఇంకొంచెం ఆల‌స్య‌మై ఉంటే ఆ దొంగను ఏకంగా శ్మ‌శానానికి తీసుకెళ్లాల్సి వ‌చ్చేదేమో అన్న అభిప్రాయాన్ని పోలీసులు వ్య‌క్తం చేశారు. ఏదేమైనా ప్ర‌భుత్వాలు చేప‌డుతున్న సెల్ఫ్ సెక్యూరిటీ శిక్ష‌ణా త‌ర‌గ‌తులు ఇంత‌గా ఉప‌యోగ‌ప‌డుతున్నాయంటే మోచ్చుకోక త‌ప్ప‌దుగా మ‌రీ..!

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad