
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కరోనా కారణంగా లాక్డౌన్ విధించడంతో మందుబాబులు నానా అవస్థలు పడ్డారు. అయితే కొందరు మందు దొరక్కపోవడంతో శానిటైజర్లు తాగుతూ వచ్చారు. ఇందులో కొందరు మృతి కూడా చెందడంతో ఆ వార్త సెన్సేషన్‌గా మారింది. అయితే తాజాగా కరోనా పోతుందనే ఉద్దేశ్యంతో కొంతమంది బ్లీచింగ్ పౌడర్ కలిపిన ద్రవం తాగుతున్నారు.
పరిసరాలు పరిశుభ్రంగా ఉంచి, కరోనాను తరిమికొట్టేందుకు ప్రభుత్వాలు బ్లీచింగ్ పౌడర్ చల్లుతుంటే, నార్త్ టెక్సాస్ జనం మాత్రం కరోనాను పోగొట్టేందుకు బ్లీచింగ్ పౌడర్ కలిపిన ద్రవం తాగుతున్నారు. వ్యాప్తి చెందకుండా ప్రభుత్వ సిబ్బంది బ్లీచింగ్ పౌడర్ చల్లుతున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో బ్లీచింగ్ పౌడర్ ద్రవం తాగడం వల్ల శరీరంలోకి ప్రవేశించిన కరోనా కూడా నశిస్తుందని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారట. దీంతో జనం వారు చెప్పినట్లుగానే ఆ ద్రవాన్ని తాగుతుండటంతో అనారోగ్యానికి గురవుతున్నారు.
ఇప్పటికే 50 మంది బ్లీచింగ్ పౌడర్ కలిపిన ద్రవం తాగి అస్వస్థతకు గురయ్యారని, ఇలాంటి వార్తలను నమ్మవద్దంటూ అక్కడి అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. ఏదేమైనా ఇలాంటి వార్తలను ప్రజలు సులువుగా నమ్ముతుండటంతోనే వారిని మోసం చేస్తూ వారి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.