Home General ఆ దేశంలో 100 రోజులుగా నో కరోనా!

ఆ దేశంలో 100 రోజులుగా నో కరోనా!

No New Corona Case Detected In Last 100 Days In New Zealand

ప్రస్తుతం కోరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ మహమ్మారి బారినపడి చాలా మంది ప్రాణాలను సైతం పొగొట్టుకుంటుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం అన్ని దేశాల్లో ఈ కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో ఆయా దేశాల ప్రభుత్వాలు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కానీ ఒక్క దేశంలో మాత్రం గత 100 రోజులుగా స్థానికంగా ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు.

న్యూజీలాండ్ దేశంలో కరోనా కట్టడికి అక్కడి ప్రభుత్వం చేపట్టిన జాగ్రత్త చర్యల వల్ల స్థానికంగా గత 100 రోజులుగా ఒక్క కొత్త కరోనా కేసు కూడా నమోదు కాలేదని అక్కడి అధికారులు వెల్లడించారు. ఆ దేశ ప్రధాని జసిండా ఆర్డర్న్ దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను కఠినతరంగా అమలు చేయడంలో విజయం సాధించడంతోనే ఈ మేర కరోనా వ్యాప్తిని నివారించగలిగారని అధికారులు అంటున్నారు. ఇక ఆ దేశానికి కొత్తగా వచ్చే వారికి ఎయిర్‌పోర్టుల్లోనే కరోనా టెస్టులు విస్తృతంగా జరిపి ముందు జాగ్రత్తగా వారందరినీ క్వారంటైన్‌లో పెడుతున్నారు. ఇలా గత 100 రోజులుగా కరోనా కట్టడిలో ఆ దేశ అధికారులు మెరుగైన తీరును ప్రదర్శించడంతో స్థానిక వ్యాప్తిని అరికట్టడంలో విజయం సాధించారు.

మే 1న చివరి స్థానిక వ్యాప్తి కేసును నమోదు చేసుకున్న న్యూజీలాండ్, నేటివరకు ఎలాంటి స్థానిక వ్యాప్తి కేసు నమోదు చేసుకోకపోవడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు అలసత్వం ప్రదర్శించి మళ్లీ పరిస్థితులను చేజారకుండా చేసుకోకూడదని అక్కడి అధికారులు అంటున్నారు. కాగా ప్రస్తుతం న్యూజీలాండ్‌లో కేవలం 23 యాక్టివ్ కేసులు మాత్రమే మిగిలి ఉన్నాయని, అవి కూడా కరోనా రోగులు దేశంలోకి అడుగుపెట్టే సమయంలో గుర్తించినవే అని అధికారులు వెల్లడించారు. మిగతా దేశాలు కూడా న్యూజీలాండ్ మాదిరిగా పటిష్టమైన జాగ్రత్తలు తీసుకుని కరోనాను కట్టడి చేయాలని ప్రపంచవ్యాప్తంగా ప్రజలు కోరుతున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad