చేతిలో చిల్లి గవ్వ లేకపోయినా.. అప్పు చేసైనా.. ప్రేమించిన అమ్మాయిని మెప్పించాలని.. స్థాయిని మరచి ప్రేమ కోసం యూత్ తిప్పలు పడుతున్నారు. ప్రేమించిన అమ్మాయి పుట్టిన రోజు దగ్గర పడుతుంది. ఏది ఏమైనా గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలి.. లేకపోతే పరువుపోతుంది. అంతే ఇక అతని మనసులో కలిగిన ఆలోచనకు మరింత పదును పెట్టాడు. వెంటనే అప్పు వేటలో పడ్డాడు. కానీ లాభం లేకపోయింది. బర్త్డే దగ్గర పడుతుంది. ఏమి చేసైనా ప్రేమ , పరువును కాపాడుకోవాలి అనుకున్నాడు వెంటనే ఫ్రెండ్స్ తో కలిసి.. అప్పు దొరకలేదని అడ్డదారి తొక్కాడు ప్రేమికుడు.
న్యూ ఢిల్లీ లో జస్వీర్ సింగ్ అనే యువకుడు ఘాడమైన ప్రేమలో మునిగిపోయాడు. అంతే ఇక గర్ల్ ఫ్రెండ్ బర్త్డే మార్చి 30 ఎలాగైనా మంచి గిఫ్ట్ , ఫ్రెండ్స్ కి ట్రీట్ ఇవ్వాలనుకున్నాడు. ప్రేమించడం తెలుసు కానీ, డబ్బు సంపాదించడం తెలియని గొప్పప్రేమికుడు. నలుగురు ఫ్రెండ్స్ తో కలసి దొంగతనం చేయాలనుకున్నాడు. అనుకున్నట్లుగానే దోపిడీ సక్సెస్ చేశాడు. జస్వీర్ సింగ్, మరో ముగ్గురు కలిసి ప్రేమను నిలబెట్టే ప్రయత్నములో భాగంగా మాస్టర్ ప్లాన్ వేశారు.
ప్లాన్ లో భాగంగా నలుగురు కలిసి క్యాబ్ బుక్ చేసుకున్నారు. అంతే ఇక దారిలో ఎవరు కనిపిస్తే వారిని దోచుకుందామనుకున్నారు. ఎవ్వరు దొరకక పోయే సరికి వెంటనే వారి దృష్టి కాస్త డ్రైవర్ మీద పడింది. మార్గ మాధ్యమంలో.. నిర్మానుశమైన ప్రదేశంలో క్యాబ్ డ్రైవర్ ను గన్ తో బెదిరించి నిలువుగా దోచేసుకున్నారు. ఆ తరువాత అక్కడ నుంచి అతడిని కొట్టి పారిపోయారు. ఘటన జరిగిన తరువాత బాధితుడు దగ్గర్లో నున్న పోలీస్ స్టేషన్ కి వెళ్లి పిర్యాదు ఇచ్చాడు. క్యాబ్ బుక్ చేసుకున్న వివరాలను సేకరించి పట్టుకున్నారు. జశ్వీర్ కోసం ఆరా తీస్తుండగా ఒక ప్రదేశంలో గర్ల్ ఫ్రెండ్ పార్టీ లో ఎంజాయ్ చేస్తున్నాడు. గురుడు దొరకగానే పోలీసులు పట్టుకొని అరెస్ట్ చేశారు. ప్రేమికురాలు ముందర పరువు పోతుందని.. గ్రహించిన యువకుడు ఇప్పుడు కటకటాల వెనక ఉండి ప్రేమ, పరువు రెండు పోగొట్టుకున్నాడు.