Home General బీటెక్ విద్యార్థిని మృతి వెనుక మిస్ట‌రీ..!

బీటెక్ విద్యార్థిని మృతి వెనుక మిస్ట‌రీ..!

విశాఖ‌లో బీటెక్ విద్యార్థిని జ్యోత్స్న మృతిపై ఇంకా మిస్ట‌రీ కొన‌సాగుతూనే ఉంది. కాగా, బీటెక్ ఫ‌స్ట్ ఇయ‌ర్ చ‌దువుతున్న జ్యోత్స్న ఈ నెల 15వ తేదీన అంకుర్ కిష్లే అనే వ్య‌క్తి ఇంట్లో అనుమానాస్ప‌ద స్థితిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని క‌నిపించింది. అంకుర్ ఇచ్చిన స‌మాచారం మేర‌కు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న పోలీసులు అన్ని కోణాల్లోనూ ద‌ర్యాప్తు మొద‌లు పెట్టారు.

అంకుర్‌ను ప్ర‌శ్నించ‌గా, ఒక ప్రైవేటు కోచింగ్ సెంట‌ర్‌లో ఫిజిక్స్ ఫ్యాకల్టీగా ప‌నిచేస్తున్న త‌న‌కు జ్యోత్స్న అక్క‌డే ప‌రిచ‌యం అయిందని చెప్పాడు. ఫిజిక్స్‌లో ఎలాంటి సందేహాలు ఉన్నా ఆమె త‌న‌ను అడిగి తెలుసుకునేద‌ని, త‌న ఇంటికి కూడా వ‌చ్చేద‌ని పోలీసుల‌కు వివ‌రించాడు.

మ‌రోప‌క్క ఈ ఘ‌ట‌న‌పై అంకుర్‌తోపాటు ఇదే ఫ్లాట్‌లో ఉంటున్న అంకుర్ స్నేహితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. జ్యోత్స్న మృతిపై ఆమె త‌ల్లిదండ్రులు అనేక అనుమానాల‌ను వ్య‌క్త‌ప‌రుస్తున్నారు. జ్యోత్స్న ఆత్మ‌హ‌త్య చేసుకునేంత పిరికిది కాద‌ని, అంకురే హ‌త్య చేసి ఆత్మ‌హ‌త్య‌గా చిత్రీక‌రించార‌ని వారు ఆరోపిస్తున్నారు. ఘ‌ట‌నా స్థ‌లంలో దొరికిన ఆధారాలే ఇందుకు నిద‌ర్శ‌న‌మంటున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad