Home General చంపడములో లేటెస్ట్ టెక్నిక్ ఫాలో అయినా ఇల్లాలు..

చంపడములో లేటెస్ట్ టెక్నిక్ ఫాలో అయినా ఇల్లాలు..

నాటి కాలంలో యువతులు పతినే ప్రత్యక్ష దైవంగా భావించేవారు. పతి ప్రాణాల కోసం యముడి తో పోరాడిన సతి సావిత్రి లాంటి వాళ్లు ఇప్పుడున్నారో లేదో తెలియదు కానీ, ప్రస్తుత రోజుల్లో తేడా వస్తే మాత్రం విలనిజం చూపిస్తున్నారు. పతి కోసం ప్రాణాలు ఇచ్చే రోజులు ఏమో కానీ ప్రాణాలు తీసేసే రోజులొచ్చాయి.

కొన్ని రోజుల క్రితం భర్తను చంపి, అతడి స్థానంలో ప్రియుడిని తీసుకరావాలని ఏకంగా ప్లాస్టిక్ సర్జరీ చేయించపోయి దొరికిపోయింది ఓ అబల. ఇలా ట్రెండ్ కి తగ్గట్టు టెక్నిక్ ఆలోచనలతో భర్తను మట్టు పెట్టె ప్రయత్నము చేస్తున్నారు. తాజాగా ఓ ఇల్లాలు.. నిద్రలోనే కళ్ళు తెరవకుండా చేసి భర్తను చంపేయాలనుకుంది. కంట్లో కారం కొడతారని విన్నాము కానీ, లేటెస్ట్ గా కంట్లో ఫెవీ క్విక్ వేసి పరారైంది ఓ మహా ఇల్లాలు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే..

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో రీవా ప్రాంతంలో జరిగింది. సంతోష్, విజయలక్ష్మి దంపతులు రీవా ప్రాంతం లో ఒక కాలనీ లో నివాసముంటున్నారు. వీరిద్దరి మధ్య కుటుంబ కలహాలు ఉండేవి. ఇలా రోజు వారిద్దరి మధ్య గొడవలు జరుగుతూనే ఉండేవి. సంఘటన రోజు చిన్నగొడవ కాస్త పెద్దగా జరిగింది చివరకు ఆరోజు సర్దుమణిగింది. కానీ ఎంతో ఆవేశము తో ఉన్న ఆమె భర్తకు తగిన బుద్ది చెప్పాలనుకుంది. తనలో ఉన్న విలన్ ని బయటకు తీసి , ఆ రాత్రి భర్త నిద్ర పోయే సమయాన కళ్లలో ఫెవీ క్విక్ వేసి ఉటాయించింది. ఉదయం మెలుకువ వచ్చిన సంతోష్ కళ్ళు తెరవడానికి ఎంత ప్రయత్నించినా, తెరవరాకపోవడంతో గట్టిగా కేకలు వేస్తూ చుట్టుపక్కవారిని పిలిచాడు. ఇరుగు పొరుగు వారు జోక్యం చేసుకొని, పరిస్థితిని అర్ధం చేసుకుని బాధితుడిని వెంటనే దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. ఎట్టకేలకు వైద్య సిబ్బంది శ్రమించి సంతోష్ కళ్ళు తెరిచేలా చేశారు. ఈ విషయము తెలిసిన భర్త, కలలో కూడా భార్య ఇలా చేస్తుందని ఊహించలేదని భాదను తట్టుకోలేక పోతున్నాడు. ప్రస్తుతం సంతోష్ చికిత్స నిమిత్తం ఆసుపత్రి లోనే ఉన్నాడు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad