Home General 14 ఏళ్లకు దొరికిన పర్సు.. అవాక్కయిన పోలీసులు!

14 ఏళ్లకు దొరికిన పర్సు.. అవాక్కయిన పోలీసులు!

Man Got His Wallet After 14 Years Of Lost

మనం ఏదైనా వస్తువు పోగొట్టుకుంటే అది దొరికేంత వరకు వెతుకుతుంటాం. ఇక అది దొరకని పక్షాణ పోలీసులను ఆశ్రయిస్తాం. అయితే అది విలువైనది అయితేనే పోలీసుల వరకు మనం వెళ్తాం. కానీ ఓ వ్యక్తి మాత్రం తన పర్సు పోయిందని, అందులో రూ.900 ఉన్నాయని పోలీసులను ఆశ్రయించాడు. వినడానికి కాస్త విడ్డూరంగా ఉన్నా, ఇది వాస్తవంగా జరగడంతో అందరూ నోరెళ్లబెట్టారు. అయితే ఈ కథకు ఇక్కడితో ఫుల్‌స్టాప్ పడలేదు.

2006లో ముంబై నగరంలో ఓ వ్యక్తి తన జేబు పర్సు లోకల్ ట్రెయిన్‌లో పోగొట్టుకున్నాడు. అందులో రూ.900 నగదు ఉందని అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 2006లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు వైరల్‌గా మారింది. హేమంత్ పదాల్కర్ అనే వ్యక్తి అప్పట్లో ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినల్ నుంచి పాన్వెల్‌కి లోకల్ ట్రెయిన్‌లో ప్రయాణించాడు. అయితే అతడు ట్రెయిన్ దిగి చూసుకుంటే అతడి పర్సు కనిపించలేదు. దీంతో అతడు పోలీసులను ఆశ్రయించాడు. కాగా 14 ఏళ్ల తర్వాత అతడికి రైల్వే పోలీసుల నుండి పోయిన పర్సు లభించిందంటూ కాల్ వచ్చింది. దీంతో అతడు ఆశ్చర్యానికి గురయ్యాడు.

హేమంత్ పోలీసుల వద్దకు వెళ్లి తన పర్సును గుర్తించాడు. అందులో రూ.900 నగదు ఉంటుందని చెప్పాడు. దీంతో పోలీసులు ఆ పర్సును చూడగా అందులో అతడు చెప్పినంత నగదు లభ్యం కావడంతో వారు నోరెళ్లబెట్టారు. ఇక అందులో నుంచి రూ.300 అతడికి తిరిగి ఇచ్చారు. రూ.100 స్టాంప్ పేపర్ వర్క్ కోసం తీసుకోగా, రూ.500 నోటు రద్దు కావడంతో దాన్ని వారు అతడికి ఇవ్వలేదు. ఇలా 14 ఏళ్ల తరువాత పోయిన పర్సు దొరకడంతో హేమంత్ ఈ విషయాన్ని నమ్మలేకపోయాడు. తన సంతోషాన్ని అతడు సోషల్ మీడియాలో పంచుకోగా, ఇప్పుడది వైరల్‌గా మారింది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad