
పుర్రెకో బుద్ధి, జిహ్వకో రుచి అన్నట్లు ఒక్కో మనిషి ఒక్కో అభిరుచిని పెంపొందించుకుంటున్నాడు. కొందరైతే తమ అభిరుచులకు అనుగుణంగా వెళ్తూ, తమకు ఇష్టమైనది దక్కించుకునేందుకు ఏది అడ్డువచ్చినా దాన్ని దాటుతు వెళ్తున్నారు. అయితే ఈ విషయంలో జర్మనీకి చెందిన ఓ వ్యక్తి మాత్రం ఎవ్వరి ఊహలకు అందకుండా ఉన్నాడు. టాటూలు అంటే మనోడికి మహాప్రాణం. దాంతో ఒంటి నిండా టాటూలు వేసుకున్నాడు.
జర్మనీకి చెందిన సాండ్రోలా అనే కళాకారుడికి టాటూలు అంటే పిచ్చి.. కాదు వెర్రి. ఒంటి నిండా టాటూలు వేసుకుని అతి భయంకరంగా తయారయ్యాడు. తన నాలుకను రెండుగా చీల్చి టాటూ వేయించుకున్నాడు. ఇప్పటివరకు ఈ ఘనుడు టాటూల కోసమే ఏకంగా రూ.6 లక్షల వరకు ఖర్చు పెట్టాడని, 17 సార్లు సర్జరీలు చేయించుకున్నాడని స్థానికులు చెబుతున్నారు. ఇక తన టాటూలకు అడ్డంగా ఉన్నాయని చెవులను కూడా కట్ చేసి తీసేశాడు ఈ ప్రబుద్ధుడు. ఆ కట్ చేసిన చెవులను ఓ జాడీలో భద్రపరుచుకున్నాడు.
ఇలా వింతగా ప్రవర్తిస్తూ తన టాటూలకు సంబంధించిన వీడియోలను, ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ క్రేజ్‌ను దక్కించుకోవాలని చూస్తున్నాడు. అయితే అతడిని చూసి స్థానికులతో పాటు నెటిజన్లు కూడా జడుసుకుంటున్నారు. సాండ్రోలా చేస్తున్న పనికి మనోడికి పిచ్చి ఎంత ముదిరిందా అని పలువురు కామెంట్ చేస్తున్నారు.