Home General కోతికి మందు తాగించిన ఘనుడు.. కటకటాల్లో తోసిన ఖాకీలు!

కోతికి మందు తాగించిన ఘనుడు.. కటకటాల్లో తోసిన ఖాకీలు!

Man Arrested For Feeding Alcohol To Monkey

ఇటీవల మూగజీవాలపై మనుష్యులు చూపిస్తున్న క్రూరత్వాన్ని ఎప్పటికప్పుడు నిరోధించేందుకు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా, ఎంత మందికి శిక్షలు వేసినా కొందరు ఏమాత్రం మారకుండా వాటిని హింసిస్తూనే ఉన్నారు. నోరులేని జీవాలను అన్యాయంగా హింసిస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్న వారికి మరింత కఠిన శిక్షలు పడేలా చేయాలనే డిమాండ్లు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. కాగా తాజాగా ఓ ప్రబుద్ధుడు ఓ కోతి పట్ల చేసిన దారుణం ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

చండీగఢ్‌లోని సెక్టార్ 35లో కామ్జింక్‌ జోన్ టాటూ స్టూడియో నిర్వాహకుడు కమల్‌జిత్‌ సింగ్‌ ఓ టాటూ ఆర్టిస్ట్. అతడు స్థానికంగా అందరికీ సుపరిచుతుడు కావడంతో అతడికి సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. కాగా అతడు ఓ కోతికి రెడ్‌ వైన్ మద్యం‌ తాగిస్తూ ఫోటో దిగాడు. దాన్ని కాస్తా సోషల్ మీడియా వేదికైన ఇంస్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. దీంతో అతడిపై స్థానికులు, నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.

ఓ మూగజీవికి మద్యం తాగిస్తావా అంటూ అతడిని నిలదీస్తున్నారు. ఇది కాస్తా పెటా(పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్) సంస్థ వారి దృష్టిలో పడటంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా కమల్‌జిత్ సింగ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు విచారిస్తున్నారు. అయితే తనకు గాయపడిన కోతి హిమాచల్ ప్రదేశ్‌లో దొరికితే దానికి వైద్యం చేయించి దాన్ని స్వేచ్ఛగా వదిలేశానని, కోతికి తాను మద్యం తాగించలేదని, కేవలం యాపిల్-దానిమ్మ జ్యూస్‌ మిశ్రమాన్ని తాగించానని చెప్పుకొచ్చాడు. అయితే అతడి మాటలు నమ్మశక్యంగా లేవని పెటా అధికారులు అంటున్నారు. దీంతో అతడి ఇంటిని తనిఖీ చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఏదేమైనా మూగజీవాల పట్ల ఇలాంటి ప్రవర్తన మంచిది కాదని, అది నేరమని పలువురు అంటున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad