Home General మందు బాబుల కోసం..షాకింగ్ నిజాలు

మందు బాబుల కోసం..షాకింగ్ నిజాలు

ఈ రోజుల్లో  మందు అనగానే   18  సంవత్సరాల వయస్సు నుండే మందు మొదలు పెడుతున్నారు.  పార్టీ చేసుకున్న, పార్టీ కి వెళ్లిన  తప్పకుండ  మందు ఉండాల్సిందే. ముఖ్యంగా యువత ఈరోజుల్లో ఎక్కువగా అలవాటు పడిపోయారు. పిల్లలు ముక్కు పట్టుకుంటారు. పెద్దలు తల పట్టుకుంటారు. బయటివారు కాలర్‌పట్టుకుంటారు అయినా  మందు త్రాగడం మాత్రం మానుకోలేరు. కానీ మందు త్రాగడం వలన మన శరీరం లో ఎన్ని జబ్బులు పొంచి ఉన్నాయో  తెలిస్తే భయం పుడుతుంది. చుక్క దిగినప్పటి నుంచి కక్కేవరకు అన్నీపోట్లే! గుండెపోటు, రక్తపోటు, మెదడుపోటు, నైతికతకు పోటు మానవత్వానికి పోటు, గౌరవానికి పోటు, చివరకు జీవితానికే పోటు! లోపల కుళ్లిపోతారు. బయటకు కుళ్లు వాసన వస్తుంది .
  • మెదడులోని ఓపియాయిడ్‌ అనే కణాల నుంచి డోపమైన్‌ అనే సంతోష రసాయనాలు బయటికి వచ్చి మెదడును కాసేపు ఉత్తేజపరుస్తాయి.అలాగే మనలో లాజిక్‌తో కూడిన ఆలోచనలకు, ప్లానింగ్‌కూ, అంచనావేయడానికి తోడ్పడే మెదడులోని ప్రీ–ఫ్రంటల్‌ కార్టెక్స్‌భాగం దెబ్బ తింటుంది. మెదడులోని సిరల్లో రక్తం గడ్డ కడుతుంది.
  • మనం రాత్రి హాయిగా పడుకోవడానికి దోహదపడే ఆర్‌ఈఎమ్‌ దశ హెల్ప్ చేస్తుంది. మద్యం తాగినప్పుడు మనలో ఆర్‌ఈఎమ్‌దశ లోపిస్తుంది.
  • మద్యం తాగిన వారిలో గురక వస్తుంది. దీనితో శ్వాసనాళం కుంచించుకుపోయినట్లుగా అవుతుంది. కొందరిలో పూర్తిగా మూసుకుపోతుంది. దీనిని స్లీప్‌ఆప్నియా అంటారు. స్లీప్‌ఆప్నియా వల్ల రక్త పోతూ పెరిగి గుండెస్పందనల్లో మార్పులు  వస్తాయి. అంతే కాకుండా నిద్రలో ప్రమాదకరమైన  ఈ గురకతో ఒక్కోసారి ఊపిరి ఆగిపోయే ప్రమాదం ఉంటుంది . అంతేకాకుండా కొందరిలో గుండె కండరం పెరుగుతుంది.
  • ముదురు రంగులో ఉండే ఆల్కహాల్‌ ద్రవాలు తాగినప్పుడు అవి తొలుత మైగ్రేన్‌ తలనొప్పికి కారణమవుతాయి.
  • సాధారణ వ్యక్తులతో పోలిస్తే ఆల్కహాల్‌ అలవాటు ఉన్నవారిలో మూర్ఛ వచ్చే అవకాశాలు మూడు రెట్లు ఎక్కువ.
  • కడుపులో పేగులో పుండ్లు, అరుగుదలలో లోపాలు ఏర్పడి, ఎసిడిటీ సమస్య వస్తుంది. ఇలా జీర్ణకోశ వ్యవస్థ దెబ్బతింటుంది.
  • చూపు దెబ్బతినడం: కంటి కండరాలు దెబ్బతిని చూపు తగ్గడం జరుగుతుంది. ఇక ఆల్కహాల్‌లో మిథనాల్‌ కలిసిన కల్తీసారా తాగితే ఒకేసారి కంటిచూపు కోల్పోవడం కూడా జరుగుతుంది.
  • కాలేయానికి ఎంతో ముప్పు: ఒంట్లోకి వచ్చే ప్రతి విషపదార్థానికీ చెక్‌పాయింట్‌ లాంటిది కాలేయం. మెల్లి మెల్లి గ కాలేయానికి ఎంతో ముప్పు ఏర్పడి నశించి పోతుంది.
చికిత్స: మద్యం మానాలన్న తీవ్రమైన సంకల్పబలం మీలో  ఉండాలి.  ఇంకా మానివేయలేమన్న  పరిస్థితులలో మానసిక వైద్యులను కలిసి సైకోథెరపీ, కౌన్సెలింగ్‌లు చేపించుకోవాలి.
ఇవి నాకు తెలిసినవి, ఇంకా మీకు ఏమైనా తెలిస్తే మాకు తెలియ చెయ్యండి, అవి మేము అందరికి తెలియజేస్తాము.
- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad