
మనం ఏదైనా పని ఎక్కువసేపు చేస్తే అసిలిపోవడం సర్వసాధారణం. కానీ కొందరు ఏ పని చేసినా ఇట్టే అలిసిపోతుంటారు. ఈ క్రమంలో కొందరిలో అలసట అనేది తరుచుగా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. వారు మెట్లు ఎక్కినా, బరువులు మోసినా, చివరకు కొద్దిగా నడిచినా కూడా అలసిపోతుంటారు. ఇలాంటి వారికి ‘లివర్ సిర్రోసిస్’ అనే వ్యాధి ఉండవచ్చని, అందుకే వారు త్వరగా అలిసిపోతుంటారని వైద్యులు అంటున్నారు.
లివర్ సమస్యలు ఉన్నవారికి ఈ లివర్ సిర్రోసిస్ వ్యాధి త్వరగా వస్తుందని వారు అంటున్నారు. లివర్ సెల్స్ దెబ్బతిని నశించిపోయి వాటి సామర్థ్యం తగ్గిపోవడాన్ని సిర్రోసిస్ అంటారని, దీని కారణంగా ప్రాణానికి హాని ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వరల్డ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆర్గనైజేషన్ తెలిపిన వివరాల ప్రకారం 2001లో ప్రపంచ వ్యాప్తంగా ఈ సమస్యతో 7,71,000 మంది మృత్యువాత పడ్డారట. కాగా 2020 నాటికి ప్రపంచంలో అత్యధిక మరణాలు సంభవించే వ్యాధుల్లో ఈ వ్యాధి 12వ స్థానంలో ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఎక్కువగా మధ్యం సేవించే వారిలో లివర్ సమస్యలు, హెపటైటిస్ బీ,సీ సమస్య తలెత్తుతుండటంతో వారిలో ఈ లివర్ సిర్రోసిస్ సమస్య ఎక్కువగా కనిపిస్తుందని వైద్యులు తెలిపారు. ఈ సమస్య వల్ల ఎక్కువగా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సి వస్తుందని వైద్యులు అంటున్నారు. అందుకే తమ లివర్ పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ఈ సమస్యను దరిచేరకుండా చూసుకోవాలని వారు హెచ్చరిస్తున్నారు.