Home General మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్.. తగ్గనున్న ధరలు!

మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్.. తగ్గనున్న ధరలు!

Liquor Prices To Go Down In AP

మందుబాబులకు ఏపీ సర్కార్ కిక్కిచ్చే న్యూస్‌ను చెప్పేందుకు రెడీ అయ్యింది. లాక్‌డౌన్ కారణంగా రెండు నెలలకు పైగా మద్యం దుకాణాలు మూతపడటంతో మందుబాబులు నానా ఇబ్బందులు పడ్డారు. కాగా లాక్‌డౌన్ తరువాత మద్యం దుకాణాలకు అనుమతి లభించగా, మద్యం ధరలను ఏకంగా 70 శాతం పెంచడంతో ఏపీ మందుబాబులు మండిపడ్డారు. ఇక అధిక ధరలకు మద్యాన్ని కొనుక్కొని తాగుతున్న మందుబాబులకు ఏపీ సర్కార్ ఓ గుడ్ న్యూస్ చెప్పనుంది.

ఎక్సైజ్ శాఖ సమాచారం ప్రకారం ఏపీలో లిక్కర్ ధరలను 30 నుంచి 40 శాతం తగ్గించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోన్నట్లు తెలుస్తోంది. క్వార్టర్ బాటిల్‌పై కనీసం రూ.30 నుంచి రూ.40 తగ్గే అవకాశం ఉందని మిగతావి వాటి బ్రాండ్‌లను బట్టి ధరలు భారీగా తగ్గనున్నట్లు సమాచారం. అధిక మద్యం ధరల కారణంగా కొందరు శానిటైజర్‌లు తాగేందుకు అలవాటు పడ్డారని, ఇదే క్రమంలో ఇటీవల ప్రకాశం జిల్లాలో 10 మంది శానిటైజర్ తాగి మృతి చెందారని అధికారులు ప్రభుత్వానికి వెల్లడించారు. అటు పొరుగు రాష్ట్రాల నుండి అక్రమంగా మద్యం రవాణా అవుతుండటం కూడా ప్రభుత్వ ఖజానాకు గండికొడుతుందని వారు తెలిపారు.

వీటన్నింటికి చెక్ పెట్టేందుకే ఏపీ సర్కార్ మద్యం ధరలను తగ్గించేందుకు అంగీకరించిందని, త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రానుందని తెలుస్తోంది. ఏదేమైనా గతకొద్ది రోజులుగా మందుబాబులు తీవ్ర కష్టాలను ఎదుర్కొంటున్నారని, ఇప్పుడు వారి కష్టాలు తీరే సమయం వచ్చిందని పలువురు మందుబాబులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad