Home General రాజ‌స్థాన్‌పై కింగ్స్ ఎలెవ‌న్ పంజాబ్ విజ‌యం..!

రాజ‌స్థాన్‌పై కింగ్స్ ఎలెవ‌న్ పంజాబ్ విజ‌యం..!

మొహాలీలో ఐఎస్ బృందాస్ స్టేడియం వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవ‌న్ పంజాబ్ విజ‌యం సాధించింది. రాజ‌స్థాన్ రాయ‌ల్ష్‌పై 12 ప‌రుగుల తేడాతో పంజాబ్ గెలిచింది. మొద‌ట బాగా ఆడిన రాజస్థాన్ ఆఖ‌రి మెట్టుపై బోల్తా ప‌డింది. హ‌ర్ష‌దీప్‌, అస్బిన్, ష‌మీ త‌లో రెండు వికెట్లు తీయ‌డంతో రాజ‌స్థాన్ కుదేలైంది. నిర్ణీత ఓవ‌ర్ల‌లో ఏడు వికెట్ల న‌ష్టానికి 170 ప‌రుగులు మాత్ర‌మే చేసింది.

రాజస్థాన్ ఓపెన‌ర్స్ రాహుల్ త్రిపాఠి 50 ప‌రుగులు, జోస్ బ‌ట్ల‌ర్ 23 ప‌రుగుల‌తో శుభారంభాన్ని ఇచ్చారు. 15 ఓవ‌ర్ల‌కు 122 ప‌రుగుల‌తో విజ‌యంవైపు ప‌య‌నిస్తున్నట్టే అనిపించింది. ఆ త‌రువాత ప్ర‌తి ప‌ది ప‌రుగుల‌కు ఒక వికెట్ చేజార్చుకోవ‌డంతో ఓట‌మిపాలైంది.

అంత‌కు ముందు బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ 20 ఓవ‌ర్ల‌లో ఆరు వికెట్‌ల న‌ష్టానికి 182 ప‌రుగులు చేసింది. పంజాబ్ ఇన్నింగ్స్‌ను కే.ఎల్‌.రాహుల్, క్రిస్ గేట్ ప్రారంభించారు. అయితే క్రిస్‌గేట్ 30 ప‌రుగులు చేసి దూకుడుగా ఆడే క్ర‌మంలో తొలి వికెట్‌గా పెవిలియ‌న్‌కు చేరాడు. అనంత‌రం రాహుల్‌లో క‌లిసిన మ‌యాంక్ అగ‌ర్వాల్ ఇన్నింగ్స్‌ను న‌డిపించాడు. మ‌యాంక్ అగ‌ర్వాల్ 26 ప‌రుగుల వ‌ద్ద భారీ షాట్‌కు య‌త్నించి ఔట్ అయ్యాడు.

ఆ స‌మ‌యంలో రాహుల్ డేవిడ్ మిల్ల‌ర్‌లు స‌మ‌యోచితంగా బ్యాటింగ్ చేసి 85 ప‌రుగుల భాగస్వామ్యాన్ని జ‌త చేశారు. రాహుల్ ఆఫ్ సెంచ‌రీ చేసిన త‌రువాత పెవిలియ‌న్ చేర‌గా, డేవిడ్ మిల్ల‌ర్ 40 ప‌రుగుల‌తో రాణించాడు. ర‌విచంద్ర‌న్ అశ్విన్ చివ‌రి రెండు బంతుల్లో రెండు సిక్స‌ర్లు కొట్ట‌డంతో కింగ్స్ పంజాబ్ స్కోరు 182 ప‌రుగుల‌కు చేరింది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad