భారత్ లోని అన్నీ పార్టీలు ఎన్నికల ప్రచారంలో మునిగిపోయిన వేళా.. పాకిస్తాన్ కాల్పుల్లో మరో భరత్ జవాన్ మృతి చెందాడు. జమ్ముకశ్మీర్లో సరిహద్దు రేఖ వెంబడి పాకిస్థాన్ బలగాలు గురువారం ఉదయం మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి భారత ఆర్మీ జవాన్లపై కాల్పులకు దిగాయి. ఈ కాల్పుల్లో ఒక జవాను అమరులైనట్లు సైన్యాధికారులు వెల్లడించారు.
రాజౌరి జిల్లాలోని “సుందర్ బాని సెక్టార్”లో ఉన్న “కెరి బెల్ట్” ప్రాంతంలో సరిహద్దు రేఖ వెంబడి పాక్ సైన్యం కాల్పులు జరిపినట్లు అధికారులు వెల్లడిచారు. ఈ ఘటనతో 2019 సంవత్సరంలో ఇప్పటి వరకు దాదాపు 110 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్తాన్ బలగాలు ఉల్లంఘించినట్లు అధికారికంగా వెల్లడించారు. ఈ దాడిలో పాక్ సైన్యం మోర్టార్ బాంబులను కూడా ప్రయోగించినట్లు గుర్తించారు భారత సైన్యాధికారులు.