Home General చదవాలని ఆశగా ఉంది.. దాతలు ఆదుకోవాలని..!

చదవాలని ఆశగా ఉంది.. దాతలు ఆదుకోవాలని..!

సరస్వతీ పుత్రుడు కానీ లక్ష్మీ దేవి కటాక్షం కోసం నాలుగేళ్లుగా నిరీక్షణ. ఆపదలో ఉన్న తనను ఆదుకునే వారు లేరు. తండ్రి చనిపోయాడు. అండగా నున్న కన్నతల్లి కాస్త అనారోగ్యంతో మంచం పట్టింది. గ్రామస్తులంతా గర్వించతగ్గ తెలివి తేటలున్నాయి. మొదటి ప్రయత్నంలోనే గేట్ లో గెలుపు సాధించిన తనకి, జీవితంలో ఎదురైనా ఒడిదుడుకులతో అక్కడే నిలబడిపోయాడు. దాతలెవరైనా తనవంతు సహాయం చేస్తే ఉన్నత చదవులు చదవి, జీవితంలో స్థిరపడాలనుందని వేడుకుంటున్నాడు.

వివరాల్లోకి  వెళ్తే ..

ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం బావోజీ తండాకు చెందిన గిరిజన విద్యార్థి తేజావత్‌ రమేశ్‌. నిరుపేద కుటుంబానికి చెందినవాడు. తండ్రి కాస్త రమేష్ పదేళ్ల వయస్సున్నపుడే మరణించాడు. రమేష్ కి ఇద్దరు అక్కలు, తమ్ముడున్నారు. పేదరికము కారణంగా తల్లి నలుగురి పిల్లలో రమేష్ ఒక్కడినే చదివించింది. రమేష్ చదువుకుంటూనే కాలీ సమయంలో కూలి పని చేస్తూ తల్లికి చేదోడువాదోడుగా ఉండేవాడు.

రమేష్ పదవ తరగతిలో 523 మార్కులు సాధించాడు. ఆ తరువాత 2009 లో బాసర త్రిపుల్‌ఐటీ లో చేరాడు. 2015 వరకు చదువు మొత్తం పూర్తిచేసాడు. తన చదువుకు ప్రభుత్వ స్కాలర్‌షిప్ తోడయ్యింది. అకాడమిక్ చివరన స్కాలర్‌షిప్ మినహా అరవైవేల రూపాయలను ఫీజు కట్టవల్సివచ్చింది. కటిక పేదరికం అనుభవిస్తున్న తన కష్టాలకు తోడుగా అదే సమయంలో తల్లి అనారోగ్యంతో మంచాన పడింది.

చదువు, తెలివి తేటలున్న రమేష్ ఎక్కడైనా ఉద్యోగము చేసుకుందామన్నా ఫీజుకట్టని కారణంగా సర్టిఫికెట్స్ బాసర కలశాలలో ఉండి పోవడంతో ఇపుడు కూలి పని చేస్తూ ఇంటిని పోషించుకుంటున్నాడు. డబ్బులు కట్టే స్థోమత లేని అతని సర్టిఫికేట్స్ ఇవ్వడానికి కాలేజ్ కరెస్పాండన్స్ కరగట్లేదు. ఐఐఐటీ చదివినా ఫలితం లేదని నాలుగేళ్లుగా కూలి చేస్తున్న రమేష్ ఈ మధ్య ఉన్నత చదువులు చదివి, స్థిరపడాలని ఉందని ప్రభుత్వం, దాతలు స్పందించి ఆదుకోవాలని అర్దిస్తున్నాడు. 9951554347 ఫోన్‌ నంబర్‌ కి సంప్రదించవలసిందిగా కోరాడు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad