Home General ఐపీఎల్‌లో చెన్నై జట్టుకు మరో షాక్

ఐపీఎల్‌లో చెన్నై జట్టుకు మరో షాక్

Harbhajan Singh May Not Play For CSK

యావత్ క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 మరికొద్ది రోజుల్లో ప్రారంభించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. ఈ యేడు ఐపీఎల్ టోర్నమెంట్‌ను భారత్‌లో కాకుండా దుబాయ్ దేశంలో నిర్వహించేందుకు నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఐపీఎల్ జట్లు దుబాయ్ చేరుకుంటున్నాయి. అయితే ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ఐపీఎల్ ఆటగాళ్లను కూడా వణికిస్తోంది.

ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి చెందిన 13 మందికి కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆ జట్టు ఆటగాళ్లు ఆందోళనకు గురవుతున్నారు. ఇలా జట్టు సభ్యులకు కరోనా సోకడంతో చైన్నై ఫ్రాంచైజీ ఆందోళన చెందుతోంది. కాగా సీనియర్ ఆటగాళ్లు ఈ టోర్నీలో ఆడేందుకు భయాందోళనకు గురవుతున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే సురేష్ రైనా దుబాయ్ నుండి తిరిగి వచ్చేసిన సంగతి తెలిసిందే. కాగా మరో ఆటగాడు హర్భజన్‌సింగ్‌ కూడా ఈ టోర్నీలో ఆడకపోవచ్చనే సంకేతాలు జట్టుకు అందుతున్నాయి.

కరోనా నేపథ్యంలో ఆయన ఇంకా జట్టులో జాయన్ కాలేదు. ఇప్పటికే మంగళవారం నాడు ఆయన జట్టులో చేరాల్సి ఉండగా, హర్భజన్‌సింగ్‌ ఇంకా దుబాయ్ వెళ్లలేదు. దీంతో కరోనా కారణంగా ఆయన జట్టులో జాయిన్ అయ్యేది లేనిది త్వరలో వెల్లడిస్తాడని, ఆయన ఈయేడు ఐపీఎల్‌లో ఆడుతాడో లేడో అనే సందేహం నెలకొంది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు గట్టి షాక్ తగిలిందని చెప్పాలి.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad