Home General అమ్మాయి, నేను, ఇంకో అబ్బాయి... ఇదో వింత ప్రేమ గాధ..!

అమ్మాయి, నేను, ఇంకో అబ్బాయి… ఇదో వింత ప్రేమ గాధ..!

కలికాలంలో వింతైన సంఘటనలు జరుగుతాయని బ్రహ్మం గారు ఏనాడో చెప్పారు. మగాళ్లు మహిళలుగా, మహిళలు మగాళ్లుగా మారే వింత బ్రహ్మం గారు చెప్పిన వింతల్లో ఒకటి. ఇప్పటివరకూ ఆడవాళ్ళు మగాడిలా జీన్స్ ప్యాంటు, షర్టు వేసుకుని తిరగడమే చూశాం. కానీ ఇక్కడ ఏకంగా ఒక అమ్మాయి, మరో అమ్మాయి కోసం మగాడిలా మారిపోయింది.

అంతగా ఆ అమ్మాయి కోసం ఈ అమ్మాయి ఎందుకు మగాడిలా మారింది అంటే వీళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమ అంత పని చేయించింది. వివరాల్లోకి వెళ్తే కేరళకు చెందిన ఒక అమ్మాయి, ఆమె స్నేహితురాలు ఇద్దరూ ఒకే కంపెనీలో జాబ్ చేస్తున్నారు. ఇద్దరి మధ్యా ఉన్న స్నేహం కాస్తా ప్రేమగా మారింది. అందరి ప్రేమికుల మాదిరిగానే కలిసి తిరిగారు. కలిసి సినిమాలకు వెళ్లారు. ఒకరికొకరు ప్రపోజ్ చేసుకున్నారు.

ఐతే పెళ్లి చేసుకోవాలంటే ఇద్దరిలో ఒకరు అబ్బాయి అయి ఉండాలి కదా. అందుకే ప్రేమ కోసం, ప్రేమించిన అమ్మాయి కోసం ఈ అమ్మాయి రెండు లక్షలు ఖర్చు పెట్టి ఆపరేషన్ చేయించుకుని మగాడిలా మారిపోయింది. “నేనూ మగాడినే, ఇక పెళ్లి చేసుకుందాం” అని చెప్పి ప్రేమించిన అమ్మాయి దగ్గరకి వెళ్తే అప్పటికే ఆ అమ్మాయి వేరే అబ్బాయితో ప్రేమలో పడింది. మగాడిగా మారిన అమ్మాయి గుండె బద్దలయినంత పనయ్యింది.

తన కోసం మగాడిలా మారితే తను వేరే మగాడిని చూసుకుంది. పెళ్లి కూడా చేసుకోవడానికి రెడీ అయ్యింది. దీంతో మగాడిగా మారిన అమ్మాయి ప్రేమించిన అమ్మాయి మీద కోర్టులో కేసు వేసినా లాభం లేకుండా పోయింది. ఆ అమ్మాయిని మర్చిపోలేక, మళ్ళీ అమ్మాయిలా మారిపోలేక నరకం అనుభవిస్తున్నాడు ఆ అబ్బాయి.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad