Home General అనుకున్న పని చేయకపోతేనే డబ్బులు.. ఎక్కడో తెలుసా?

అనుకున్న పని చేయకపోతేనే డబ్బులు.. ఎక్కడో తెలుసా?

German University Scholarship For Doing Nothing

సాధారణంగా విద్యార్ధులలోని ప్రతిభను వెలికితీసేందుకు వారికి స్కాలర్‌షిప్‌లను అందిస్తుంటాయి కొన్ని యూనివర్సిటీలు. వారు తమలోని నైపుణ్యాలను మెరుగుపర్చుకునేందుకు ఈ విధంగా స్కాలర్‌షిప్‌లతో ప్రోత్సహిస్తుంటారు. కానీ జర్మనీలోని ఓ యూనివర్సిటీ విద్యార్ధులకు స్కాలర్‌షిప్‌ను ఎందుకు ఇస్తుందో తెలిస్తే మాత్రం మీరు నోరెళ్లబెట్టడం ఖాయం.

విద్యార్ధులు తమ ప్రతిభను కనబర్చేందుకు ఎన్నో చేయాలని ఆలోచిస్తుంటారు. వారు తమ కోర్సులను పూర్తి చేసేందుకు ఏదో చేయాలని ఏవేవో ప్లాన్ చేస్తుంటారు. ఇలా ఏదైనా ఒక విషయాన్ని వారు అనుకుని, దాన్ని ఏమాత్రం చేయకుండా ఉండటమే వారికి ఇచ్చిన టాస్క్. విద్యార్ధులు ఏదైనా అనుకుని, దాన్ని అసంపూర్తిగా చేయడమో, దాన్ని తప్పుగా చేయడమో లాంటివి చేయకూదని, అందుకే వారికి ఇలాంటి టాస్క్ ఇచ్చినట్లు హోంబర్గ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ తెలిపింది.

ఈ విధంగా అనుకున్న పనిని ఏమాత్రం చేయకుండా ఉన్న విద్యార్దులకు 1600 యూరోలను(దాదాపు రూ.1.4 లక్షను) అందించనున్నట్లు యూనివర్సిటీ అధికారులు తెలిపారు. ఇలాంటి వినూత్నపు ఆలోచనలు మన దేశంలోనూ వచ్చుంటే బాగుండేదని పలువురు కామెంట్ చేస్తున్నారు. అయితే ఈ స్కాలర్‌షిప్ కేవలం జర్మనీలోని విద్యార్ధులకు మాత్రమే అందజేయనున్నట్లు ఆ యూనివర్సిటీ అధికారులు తెలపడం కొసమెరుపు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad