క్షణ క్షణం భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్న ఈ నేపథ్యంలో పాక్ రెచ్చగొట్టే చర్యలను మానుకోవట్లేదు. బుదవారం ఉదయమే పాకిస్తాన్, భారత్ లోకి యుద్ధ విమానాలను పంపి మన సైనికులపై దాడి చేయాలని చూసింది. కానీ వారి ప్రయతాన్ని మన జవాన్ లు తిప్పికొట్టారు. ఈ క్రమంలో అభినందన్ అనే ఒక కమాండర్ పాకిస్తాన్ చేతిలో బందీగా మారాడు.
నిజానికి యుద్ద ఖైధీని సింశించకూడదు.. కానీ పాక్ అభినందన్ ని చిత్రా హింసాలకు గురిచేసింది. అందుకు సంబందించిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసి భారత్ ని బయపెట్టాలి అని చూసింది పాక్.. కానీ ఏమైదో తెలియదు సాయంత్రానికి మనసు మార్చుకుంది. భారత్ కమాండర్ అభినందన్ కి ట్రీట్ మెంట్ చేయించి, అతడితో “పాక్ ప్రభుత్వం నన్ను చాలా చూసుకుంటుంది” అని చెప్పించారు. ఒకపక్క కవ్వింపు చర్యలు చేస్తూనే బయటకి మాత్రం శాంతికి మేము సిద్దంగా ఉన్నాం అంటూ చెబుతుంది.
పాకిస్తాన్ చరిత్ర తెలిసిన భారత్ ఆర్మీ.. పాక్ ఎన్ని నాటకాలు ఆడినా ఈసారి నమ్మేది లేదని.. యుద్దం వస్తుందా లేదా అన్నది పక్కన పెడితే, భారత్ అంటే ఏంటో పాక్ తో పాటు ప్రపంచానికి తెలియాలి అని దృడ నిర్ణయం నితీసుకుంది. దీనికి భారత ప్రదాని నరేంద్ర మోధి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. అందువల్ల తరువాతి స్టెప్ ఏంటి ? అనే ప్లానింగ్ లోనే ఉంది భారత్. ఏ క్షణానా గుడ్ న్యూస్ వస్తుందో తెలియదు కానీ.. వచ్చేది మాత్రం గుడ్ న్యూస్ ఏ అని భారత ఆర్మీ బల్లగుద్ధి చెబుతుంది.
ఇలాంటి టైమ్ లో పాక్ యుద్దానికి మేము సిద్దం అనేలా కవ్వింపు చెర్యలకు పాల్పడుతుంది. అందులో బాగంగానే భారత గగనతంలోకి పాక్ యుద్ధ విమానాలు మరోసారి ప్రవేశించినట్లు తెలుస్తోంది. నిబంధనలను ఉల్లంఘిస్తూ జమ్ముకశ్మీర్, పూంచ్ లోని మెంధర్ ప్రాంతంలో గగనతలంలో గురువారం పాక్ యుద్ధ విమానాలు చక్కర్లు కొట్టినట్లు సమాచారం. ఈ విషయాన్ని క్షణాల్లోనే గుర్తించిన భారత వైమానికదళం వెంటనే ప్రతిస్పందించడంతో అవి వెనుదిరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పూర్తి సమాచారం ఇంకా అందాల్సి ఉంది.