Home General పరువు కోసం కుమార్తె ప్రాణం తీసాడు..!

పరువు కోసం కుమార్తె ప్రాణం తీసాడు..!

దళిత యువకుడిని ప్రేమించిందని కన్న కూతురిని గొంతునులిమి చంపేశాడు. కన్న తండ్రే కసాయివాడయ్యి పరువు కోసం పేగు బంధాన్ని తెంచుకునేందుకు కూడా వెనుకాడలేదు. ప్రేమ పేరుతో కుటుంబం పరువు తీస్తుందని కర్కశంగా తన చేతులతోనే గొంతు నులిమి చంపేశాడు. ఈ దుర్ఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది.

వివరాల్లోకి వెళ్తే…

ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం సమీపాన కొత్తపాలెంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. కొత్తపాలానికి చెందిన కృష్ణారెడ్డి కి ఇద్దరు కుమార్తెలు , ఒక కుమారుడు. రెండవ కూతురు వైష్ణవి(20). ఒంగోలు లోని ఓ ప్రైవేట్ కాలేజీ డిగ్రీ చదువుతుంది. బీకామ్ మూడవ సంవత్సరం చదువుతున్న వైష్ణవి తన తోటి విద్యార్థి అయిన సునీల్ ని ప్రేమించింది. వీరి ఇద్దరి ప్రేమ వ్యవహారం తెలిసి కాలేజీ యాజమాన్యం వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. పెద్దల సమక్షంలో సునీల్ కి, వైష్ణవికి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఎన్ని రోజులు గడచినా ఇద్దరిలో ఎలాంటి మార్పు రాలేదు. ప్రేమ వ్యవహారం లో పెద్దలు వైష్ణవి ని చాలా సార్లు మందలించారు.

అమ్మాయి ప్రేమ విషయం పై ఆగ్రహించిన తండ్రి తాను చెప్పిన వాడిని పెళ్లి చేసుకోవాలంటూ మందలించారు. దీంతో ఇంట్లో గొడవ జరగడం మొదలయింది. రాత్రి ఏమిజరిగిందో తెలియదు వైష్ణవి మాత్రం తెల్లారేలోపు అనుమానస్పద స్థితిలో చనిపోయింది. కూతురికి ఆరోగ్యం లేకనే మరణిచిందంటూ ఉదయం కృష్ణారెడ్డి డ్రామా ఆడాడు. తన మాటలతో చుట్టూ పక్కల స్థానికులను నమ్మించే ప్రయత్నం చేశాడు. వైష్ణవి తండ్రి గొంతునులిమి చంపేశాడని అనుమానించిన స్థానికులు అతడి పై అనుమానము వచ్చి స్థానిక వి.ఆర్.ఓ కి ఫిర్యాదు చేశారు. వెంటనే వి.ఆర్.ఓ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అక్కడికి చేరుకున్న పోలీసులు వైష్ణవి తల్లిదండ్రులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. తక్కువ కులానికి చెందిన వ్యక్తిని ప్రేమించిందనే కారణముతో కృష్ణారెడ్డి కూతురిని చంపినట్టు  పోలీసులు నిర్దారణ చేశారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad