Home General మత్తులో రెచ్చిపోయిన యువతులు.. యువకుడిని ఏం చేశారో తెలుసా?

మత్తులో రెచ్చిపోయిన యువతులు.. యువకుడిని ఏం చేశారో తెలుసా?

Drunken Young Women Harassed Teenager

మద్యం మత్తులు మనుష్యులు ఏం చేస్తారో వారికే తెలియదు. ఒక్కోసారి వారు చేసే పనులు ఇతరులకు ఇబ్బంది కలిగించడమే కాకుండా పలు ప్రమాదాలకు కూడా దారితీస్తుంటాయి. అయితే కరోనా వైరస్ నేపథ్యంలో రెండు నెలలపాటు మద్యం దుకాణాలు మూతపడిన సంగతి తెలిసిందే. దీంతో మందుబాబులు మద్యానికి అలవాటుపడిపోయి అది దొరక్కపోవడంతో, ఏది పడితే అది తాగేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది శానిటైజర్లు తాగుతుండగా, ఏపీలో ఏకంగా 10 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఇక కొందరైతే మత్తు కోసం వైట్‌నర్‌లను వాడుతున్నారు.

కాగా మగవారు మాత్రమే మత్తుకు అలవాటు పడలేదు. కొందరు ఆడవారు కూడా ఈ విధంగా ప్రవర్తిస్తూ ఇతరులకు ఇబ్బందిని క్రియేట్ చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని చైతన్యపురిలో మద్యం మత్తులో నలుగురు మహిళలు సృష్టించిన వీరంగం అక్కడున్నవారిని భయబ్రాంతులకు గురి చేసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, మద్యం మత్తులో ఉన్న నలుగురు యువతులు, చైతన్యపురిలోని కనకదుర్గ వైన్స్‌ ఎదురుగా ఉన్న బస్‌స్టాప్‌లో వైట్‌నర్‌ పీల్చుతూ కూర్చున్నారు. అక్కడ రోడ్డుపై వచ్చిపోయే వారితో దాడికి దిగారు. అక్కడే బస్టాప్‌లో నిద్రుస్తున్న ఓ యువకిడి పట్ల వారు నీచంగా వ్యవహరించారు.

ఆ యువకుడి బట్టలు విప్పేసి, అతడిపై దాడికి దిగారు. దీంతో స్థానికులు వారిని అడ్డగించారని, లేకపోతే ఆ యువకుడి పరిస్థితి ఏమై ఉండేదో అంటూ పలువురు తెలిపారు. రాత్రి వేళ జరిగిన ఈ ఘటనతో అక్కడున్నవారు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. పోలీసులు ఇలాంటి మహిళలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఏదేమైనా మద్యం మత్తులో మగవారే కాదు ఆడవారు కూడా తమ విచక్షణను కోల్పోతారని ఈ ఘటనతో మరోసారి రుజువైంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad