Home General పులిపిర్లే క‌దా అని వ‌దిలేయ‌కండి - ప్రాణాంత‌క‌మ‌ని తెలుసుకోండి..!

పులిపిర్లే క‌దా అని వ‌దిలేయ‌కండి – ప్రాణాంత‌క‌మ‌ని తెలుసుకోండి..!

మ‌నిషి త‌న శ‌రీరంలో వ్యాధి నిరోధ‌క‌శ‌క్తిని కోల్పోతే బ్యాక్టీరియా ఉత్ప‌త్తి ఎక్కువై ఆసుప‌త్రిపాలు చేస్తుంద‌న్న సంగ‌తి తెలిసిందే. కానీ, ఓ వ్య‌క్తి మాత్రం ఆస్ప‌త్రిపాలుకావ‌డంతోపాటు చెట్టులా త‌యారవుతున్నారు. వేర్లు చుట్టూరా ఎరువు వేసిన చెట్టులా రోజు రోజుకు పెరుగుతున్న త‌న చేతుల ఆకారాన్ని చూసి స్థానికులు సైతం భ‌య‌ప‌డుతున్నారు. ఈ సంఘ‌ట‌న బంగ్లాదేశ్‌లో చోటు చేసుకుంది.

అబుల్ బ‌జంద‌ర్ అనే 28 ఏళ్ల వ్య‌క్తి గ‌త కొంత కాలంగా త‌న శ‌రీరంలో మార్పులు వ‌స్తుండ‌టంతో వైద్యుల‌ను సంప్ర‌దించాడు. త‌న రెండు చేతి వేళ్లు వేర్లులా, చేతి క‌ణిక చెట్టు మొద‌లులా, మిగ‌తా భాగం మొత్తం చెట్టు కాండంలా త‌యార‌వుతుండ‌టాన్ని గ‌మ‌నించిన వైద్యులు ఆయ‌న‌కు హెచ్‌పీవీ అనే వైరస్ సోకిన‌ట్లు గుర్తించారు.

త‌న‌కు ఈ వ్యాధి చిన్న‌ప్ప‌ట్నుంచే ఉంద‌ని, చిన్న‌ప్పుడు పులిపుర్లులే కదా..! అని వ‌దిలేశాన‌ని, ఆ త‌రువాత ఒక్కొక్క పులిపురిని తొల‌గిస్తూ వ‌చ్చాన‌ని, అయినా తొల‌గించిన మ‌రికొన్ని రోజుల‌కే అదే చోట మ‌ళ్లీ పులిపిర్లు రావ‌డంతోపాటు అలా త‌న రెండు చేతుల‌ను క‌ప్ప‌వేశాయ‌ని అబుల్ బ‌జంద‌ర్ చెప్పారు. త‌న‌కు వ్యాపించిన ఈ వ్యాధి వ‌ల్ల ఇప్ప‌టి వ‌ర‌కు 16 ఆస్పుత్రుల్లో ఆప‌రేష‌న్‌లు చేయించుకున్న‌ట్లు తెలిపారు.

అబుల్ బ‌జంద‌ర్‌కు వ్యాధి నిరోధ‌క శక్తి త‌గ్గ‌డంతో వ్యాపించిన ఈ వ్యాధితో ప్రాణానికే ముప్పు ఉంద‌ని అత‌ని వైద్యుడు సమంత లాల్ సేన్ చెప్పారు. బ‌జంద‌ర్ సోకిన వ్యాధిపై ప‌రిశోధ‌న‌లు జ‌రిపేందుకు తొమ్మిది మంది వైద్యుల బృందాన్ని ఏర్పాటు చేసిన‌ట్టు చెప్పారు స‌మంత లాల్ సేన్‌.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad