ఇటీవల కాలంలో యువతపడుతున్న పెడదారి గురించి ప్రత్యేకంగా చెప్పాలా..? అందుకు ప్రధాన కారణం సోషల్ మీడియానేనని తల్లిదండ్రులు వాదిస్తుండగా, కాదు.. కాదు.. తల్లిదండ్రులేనని, తల్లిదండ్రులు డబ్బుపై మమకారంతో ప్రత్యేక శ్రద్ధపెట్టనందునే యువత పెడదారిపడుతున్నారంటూ సోషల్ మీడియా యూజర్లు అంటున్నారు. ఇలా ఒకరిపై మరొకరు ఆరోపణలు, విమర్శలు చేసుకుంటూనే అసలు విషయాన్ని పక్కదారి పట్టిస్తూ వారూ పెడదారిన పడుతున్నారు.
పెడదారిపట్టిన యువతలో తామూ ఒకరమంటూ ఓ యువ జంట రుజువు చేసింది.తల్లిదండ్రులకు కుంటిసాకులు చెప్పి చెట్ల పొదల్లో ఏకాంతంగా కలుసుకున్న ఆ జంటకు చేదు అనుభవం ఎదురైంది. శృంగారానికి ఉపక్రమించి చివరకు రక్తాన్ని కళ్ల చూశారు. ఎటువంటి అవగాహన లేకుండా శృంగారంలో పాల్గొన్న ఆ జంట చివరకు వైద్యులతో చీవాట్లు తినాల్సి వచ్చింది.
ఈ సంఘటన వియత్నాంలోని హనోయ్‌లో చోటు చేసుకుంది. సంబంధించి వైద్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి…హనోయ్‌కు చెందిన ఓ జంట తమ వద్దకు వైద్య పరీక్షల నిమిత్తం వచ్చారని, తమ జననాంగాలపై రక్తస్రావం జరుగుతుందని తెలిపారని, దీంతో అసలేం జరిగిందో తెలుసుకునేందుకు ఆ యువ జంటను ఆరా తీయగా అసలు విషయం తెలిపారని వైద్యులు తెలిపారు.
తాము ఇంట్లో తల్లిదండ్రులను మభ్యపెట్టి బయటకు వచ్చినప్పట్నుంచి.. చెట్లపొదల్లో ఏకాంతంగా గడుపిన వివరాలన్నిటిని పూసగుచ్చినట్లు ఆ యువ జంట వైద్యులకు తెలిపారు. తాము ఇళ్ల నుంచి బయల్దేరే సమయంలో కండోమ్ ప్యాకెట్స్ కోసం మెడికల్ షాపుకు వెళ్లేందుకు భయపడ్డామని, దీంతో తమ దగ్గరే ఉన్న ప్లాస్టిక్ కవర్‌తో పని కానిచ్చేసినట్లు ఆ యువజంట వైద్యులతో చెప్పుకొచ్చింది. మొదట్లో బాగానే అనిపించినా.. పని అయ్యాక ఇద్దరి జననాంగాలపై రక్తస్రావం అయిందని దాంతో ఆస్పత్రికి వచ్చినట్లు యువ జంట తెలిపింది.
యువ జంట జరిగిన విషయాన్ని నిక్కచ్చిగా చెప్పడంతో స్పందించిన వైద్యులు వైద్య పరీక్షలు చేశారు. రక్తస్రావం జరగకుండా ఆపారు. ఎటువంటి ఇన్ఫెక్షన్ సోకకుండా వ్యాధి నిరోదక టీకాలు వేశారు. ఇకపై కండోమ్ లేకుండా శృంగారంలో పాల్గొనకూడదని ఆ యువ జంటకు సూచించారు.
ఇంతకీ మీకు అసలు విషయం చెప్పలేదు కదూ..! వియత్నాంలోని 60 శాతం యువతకు శృంగారం సమయంలో కండోవామ్ వాడాలన్న పరిజ్ఞానమే తెలీదట. ఈ విషయం ఇటీవల ఆ దేశానికి సంబంధించిన పలు యూనివర్సిటీలు జరిపిన పరిశోధనల్లో వెలుగు చూసింది. మరో 20 శాతం యువతకు కండోమ్ కొనాలంటేనే సిగ్గుపడతారట.దీంతో ఆ దేశ యువత శృంగారం సమయంలో చోటు చేసుకుంటున్నగాయాలతో నిత్యం బాధపడుతున్నట్లు సర్వేలు వెల్లడించాయి. ఈ సమస్య కేవలం వియత్నాదే అనుకుంటే పొరపాటే సుమీ… భారత్‌ది కూడాను..!