
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ఎలాంటి ప్రభావం చూపిస్తుందో అందరికీ తెలిసిందే. కరోనా దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఉపాధి కోల్పోయి రోడ్డునపడ్డారు. తినడానికి తిండిలేకపోవడంతో వారు నానా అవస్థలు పడుతున్నారు. అయితే ఓ జంట మాత్రం కరోనా దెబ్బకు రోడ్డున పడ్డా కూడా తమ కామ కోరికను తీర్చుకున్నారు. ఇది చూసి అక్కడి జనం అవాక్కయ్యారు.
క్యాలిఫోర్నియాలోని స్టాక్టన్ ప్రాంతంలోని ఓ ఫుట్‌పాత్‌పై ఓ మహిళ వాకింగ్ చేస్తోంది. అయితే రోడ్డుపక్కన ఓ జంట శృంగారంలో మునిగితేలుతూ ఆమె కంటపడ్డారు. రోడ్డుపై ఇదేం పాడు పని అని ఆమె వారిని ప్రశ్నించింది. కాగా కరోనా కారణంగా తాము ఉద్యోగం కోల్పోయామని, దాని ప్రభావంతో ఇళ్లు కూడా పోయి రోడ్డున పడ్డామని వారు బదులిచ్చారు. శృంగారంలో పాల్గొని చాలా రోజులయ్యిందని, అందుకే తాము అలా చేయాల్సి వచ్చిందని వారు బదులిచ్చారు.
కరోనాతో సర్వం కోల్పోయిన వారిని చూసి జాలి పడాలో, లేక వారు చేస్తున్న పనికి ఆగ్రహించాలో అర్ధంగాక అక్కడున్న వారు తలలు పట్టుకున్నారు. ప్రభుత్వం ఇలాంటి వారికి ఏదైనా షెడ్ లాంటిది ఏర్పాటు చేసి వసతులు కల్పించాలని వారు కోరారు. ఏదేమైనా కరోనా దెబ్బకు అందరూ తిండికోసం పాకులాడుతుంటే, ఆ జంట మాత్రం కామకేళిలో మునిగితేలడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.