Home General రూ.2వేల నోట్ల ర‌ద్దుపై ఆర్థిక వ్య‌వ‌హారాల కార్య‌ద‌ర్శి క్లారిటీ..!

రూ.2వేల నోట్ల ర‌ద్దుపై ఆర్థిక వ్య‌వ‌హారాల కార్య‌ద‌ర్శి క్లారిటీ..!

కేంద్రంలోని మోడీ స‌ర్కార్ స‌రికొత్త నిర్ణ‌యం. రిజ‌ర్వు బ్యాంక్ ఇక‌పై రూ.2వేల నోట్లను ముద్ర‌ణ చేయ‌దు. అందుకు కార‌ణం అతి త్వ‌ర‌లో సాధార‌ణ ఎన్నిక‌లు రానుండ‌ట‌మే అంటూ గురువారం నాడు ప‌లు మీడియా ఛానెళ్ల‌లో పెద్ద పెద్ద హెడ్డింగ్‌ల‌తో స్క్రోలింగ్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. మ‌రికొన్ని ఛానెళ్ల‌యితే ఇక‌పై రెండువేల రూపాయ‌ల నోట్లు చెల్లుబాటుకావు అనే రీతిలో ప్ర‌త్యేక క‌థ‌నాల‌ను ప్ర‌సారం చేశాయి. కానీ, ఆ వార్త‌ల‌న్నీ వ‌ట్టి ట్రాష్ అని దేశ ఆర్థిక వ్య‌వ‌హారాల కార్య‌ద‌ర్శి సుభాశ్ చంద్ర గార్గ్ తెలిపారు.

కాగా, ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ రూ.2వేల నోట్ల ర‌ద్దూ అంటూ క‌థ‌నాల‌ను ప్ర‌సారం చేసిన మీడియా ఛానెళ్ల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆయ‌న అస‌లు విష‌యం చెబుతూ, దేశ అవ‌స‌రాల‌కు స‌రిప‌డా రూ.2వేల నోట్లు ఇప్ప‌టికే అందుబాటులో ఉన్నాయ‌ని, ఆ క్ర‌మంలోనే రూ.2వేల నోట్ల ముద్ర‌ణ‌ను ఆపేసిన‌ట్లు చెప్పుకొచ్చారు.

అంతేకాకుండా, అవినీతిప‌రులు, ప్ర‌భుత్వాల‌కు క‌ట్టాల్సిన ప‌న్నులు బ‌కాయిలు ప‌డ్డ‌వారు, మ‌నీ ల్యాండ‌రింగ్ చేసేవారు, అంతేకాకుండా, ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఓట్ల కోసం రూ.2వేల నోట్ల‌ను ఎక్కువ‌గా ఉప‌యోగిస్తున్న‌ట్టు త‌మ దృష్టికి వ‌చ్చింద‌ని, అటువంటి కార్య‌క‌లాపాలు ఇక‌పై జ‌ర‌గ‌కుండా ఉండేందుకు ప్ర‌స్తుతానికి రూ.2వేల నోట్ల ముద్ర‌ణ‌ను ఆపేసిన‌ట్టు చెప్పారు సుభాశ్ చంద్ర గార్గ్‌.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad