Home General ప్రేమతో మోసం చేసి.. దహన సంస్కరణలు చేశాడు..!

ప్రేమతో మోసం చేసి.. దహన సంస్కరణలు చేశాడు..!

నిన్న హైదరాబాద్ లో ప్రేమోన్మాది కత్తి తో నరికాడు. ఈరోజు మరో ప్రేమోన్మాది ఏకంగా కాల్చి బూడిద చేశాడు. సంక్రాంతి రోజు జరిగిన ఈ సంఘటన ఈ మధ్య వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన గుంటూరులో జరిగింది. గుంటూరులో యువతి హత్య కలకలం రేపింది. మమతా శెట్టి అనే యువతిని దివాకర్ ప్రేమ పేరుతో మోసం చేసి దారుణంగా హత్య చేశాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణలో ఆశ్చర్యకరమైన నిజాలు బయటకు వచ్చాయి.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…

మమతా శెట్టి అనే యువతి ఒరిస్సా నుండి వచ్చి, గుంటూరులో ఒక మిల్లులో పనిచేస్తుంది. ఇదే మిల్లులో కొంత కాలంగా పనిచేస్తున్నాడు దివాకర్. ఇతను కూడా ఒరిస్సా అతను కావడంతో, మమతా శెట్టి సాన్నిహిత్యంగా ఉంది. కానీ అతను ప్రేమిస్తున్నాని వెనకపడ్డాడు. దీంతో మమతా శెట్టి కుడా అంగీకరించింది. కానీ కొంత కాలం గడిచాక అతని నిజస్వరూపం బయట పెట్టాడు. పెళ్లి చేసుకోమని అడిగిన మమతను నామరూపాలు లేకుండా చేశాడు.

ఆ యువతిని ప్రేమ పేరుతో మోసగించి త్రీవ ఇబ్బందులకు గురిచేసి దారుణంగా హతమార్చాడు. ఆమె ఎలా మరణించిందో కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఆమెను దారుణంగా దివాకర్ హత్య చేసి, ఆమె మృత దేహాన్ని స్మశానంలో కాల్చేశాడని పోలీసులు గుర్తించారు. మరో వైపు స్మశానంలో మమతా అస్థికలుసైతం సేకరించిన పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. నిందితుడితో పాటు అతడికి సహకరించిన మరో ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మిల్లు యాజమాన్యం సహకారంతోనే ఇదంతా జరిగినట్లు సమాచారం. గత సంక్రాంతి రోజు జరిగిన ఘటనకు సంబందించిన వ్యవహారం పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం నిందితుడు ఒరిస్సా పారిపోయినట్టు తెలుస్తుంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad