Home General సోనూ సూద్ విరాళంపై బ్రహ్మీ కామెంట్.. అడుక్కుతినాల్సిందే!

సోనూ సూద్ విరాళంపై బ్రహ్మీ కామెంట్.. అడుక్కుతినాల్సిందే!

Brahmanandam Comments On Sonu Sood Help For Migrants

కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా దాదాపు మూడు నెలలపాటు పూర్తి లాక్‌డౌన్‌ను విధించిన సంగతి తెలిసిందే. ఈ లాక్‌డౌన్ కారణంగా ప్రజలు నానా కష్టాలు పడ్డారు. ముఖ్యంగా వలస జీవులు తమ సొంతూళ్లకు వెళ్లేందుకు ఎంత కష్టపడ్డారో అందరికీ తెలిసిందే. చాలా మంది వేల కిలోమీటర్లు కాలినడకన వెళ్లిన దృశ్యాలు మనం టీవీల్లో చూశాం. కాగా వలస కార్మికుల కష్టాలను చూసి చాలా మంది చలించిపోయారు.

వారిలో బాలీవుడ్ నటుడు సోనూసూద్ కూడా ఒకరు. అయితే ఆయన తన సొంత ఖర్చులతో వలస కార్మికుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి వారిని తమ స్వస్థలాలకు పంపిన సంగతి తెలిసిందే. ఇక అప్పుడు మొదలుపెట్టిన సోనూ సూద్, వరుసగా కష్టాల్లో ఉన్నవారికి సాయం చేస్తూ వస్తున్నాడు. అయితే సోనూ సూద్ చేస్తున్న సాయం గురించి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారు. కానీ తాజాగా టాలీవుడ్ కమెడియన్ బ్రహ్మానందం, సోనూ సూద్ చేస్తున్న సాయంపై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

తమ సొంత ఖర్చులతో ఇతరులకు సాయం చేయడం మంచి పనే, అయినా వెనకా ముందు చూసుకోకుండా సాయం చేస్తూ వెళ్లకూడదని బ్రహ్మానందం హితవు పలికారు. అయితే సాయం చేసి ఫోటోలకు పోజివ్వడం తనకు నచ్చదని బ్రహ్మానందం చెప్పుకొచ్చాడు. తాను కూడా సోనూ సూద్‌లా కాకపోయినా కొంతమేర సాయం చేశానని, అయితే దాని గురించి ఎవ్వరికీ తెలియదు ఎందుకంటే తాను ఫోటోలు తీయించుకోలేదని బ్రహ్మీ సెటైర్ వేశారు. కాగా సోనూ సూద్‌లాగా తాము కూడా పాపులర్ అవ్వాలని ఉన్నది కాస్త దానం చేస్తూ పోతే అడుక్కుతినాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, డబ్బు విలువ తెలిసినవారే దానాలకు ముందుకు రావాలని ఆయన హితవు పలికారు. ఏదేమైనా బ్రహ్మానందం చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad