Home General పాము అనుకుని భార్యని చావబాదిన భర్త

పాము అనుకుని భార్యని చావబాదిన భర్త

ఫ్యాషన్ దుస్తుల్లో చంపేస్తుంది రా బాబూ అనుకునేలా ఉండాలి కానీ, అదే ఫ్యాషన్ దుస్తులు వేసుకుని చచ్చేలా ఉండకూడదు. ఫ్యాషన్ దుస్తులు వేసుకుంటే చస్తారా? అంటే దరిద్రం డ్యాండ్రఫ్ పట్టినట్టు పడితే చచ్చినా చస్తారు. అదృష్టం బాగుంటే చావు అంచుల వరకూ వెళ్ళినా బతుకుతారు. అసలు ఈ ఫ్యాషన్ ఏంటి? చావు ఏంటి? ఈ గోల ఏంటి? అనుకుంటున్నారా? వస్తున్నా, ఆ పాయింట్ కే వస్తున్నా.

ఈ మధ్య జంతువుల చర్మాన్ని పోలిన దుస్తులు, చెప్పులు, బెల్టులు, యాక్ససరీలు వంటివి రావడం కామన్ అయిపోయింది. క్రియేటర్స్ కి క్రియేటివిటీ ఎక్కువైపోయి ఇలా జంతువులని పోలి ఉండేలా టీషర్టులు, ప్యాంట్లు వంటివి తయారుచేస్తున్నారు. అదే ఫ్యాషన్ అనుకుని వేసుకుని తెగ మురిసిపోతున్నారు జనాలు. తాజాగా మెల్ బోర్న్ కి చెందిన ఒక మహిళ, పాముల డిజైన్లతో చేయబడిన లెగ్గిన్స్ ని వేసుకుంది. పాదాల నుంచి మోకాళ్ళ వరకూ పొడవాటి పాముల్లా కనబడేలా లెగ్గిన్స్ వేసుకుని బెడ్ షీట్ కప్పుకుని పడుకుంది. భర్తని ఆటపట్టించాలని అతను నిద్రపోయాక బెడ్ షీట్ తీసెసింది. ఇంకేముంది ఆమె భర్త మధ్య రాత్రిలో నిద్రలేచి ఈమె కాళ్ళు చూసి పాములు మంచం మీదకి వచ్చాయని చప్పుడు చేయకుండా పక్కనే ఉన్న బేస్ బ్యాట్ తీసుకుని పిచ్చ కొట్టుడు కొట్టాడు. ఆమె కేకలు పెడుతుండడంతో పాములు ఇంకా చావలేదనుకుని ఇంకా కొడుతూనే ఉన్నాడు. దీంతో ఆమె ఒక్కసారిగా, అవి పాములు కాదు, నా కాళ్ళు అని చెప్పడంతో ఆమె భర్త కొట్టడం ఆపేసి లైట్స్ వేసి చూశాడు.

అసలు విషయం అప్పుడు తెలిసింది. ఆమె కాళ్ళకి బాగా దెబ్బలు తగిలాయి. వెంటనే ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్ళాడు భర్త. బేస్ బ్యాట్ తో కొట్టడం వల్ల ఆమె కాళ్ళు విరిగిపోయాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. “ఎంత ఫ్యాషన్ ఐతే మాత్రం ఇలాంటివి రాత్రుళ్లు వేసుకుంటారా? ఇంకాస్త గట్టిగా కొట్టుంటే ఏంటి పరిస్థితి” అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంతమంది ఐతే, అతనికి ముందే తెలిసి ఉంటుంది. మామూలుగా ఉన్నప్పుడు పెళ్లాన్ని ఎలాగూ కొట్టలేడు కాబట్టి పాము వంకతో కొట్టేసుంటాడు” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా కానీ,….ఫ్యాషన్ దుస్తుల్లో చంపేస్తుంది రా బాబూ అనుకునేలా ఉండాలి కానీ, అదే ఫ్యాషన్ దుస్తులు వేసుకుని చచ్చేలా ఉండకూడదు. ఇలాంటి ఫ్యాషన్ వేర్ ఎక్కడ వేసుకోవాలో కాదు, ఎక్కడ వేసుకోకూడదో తెలిసినవాళ్ళే గొప్ప అని ఈపాటికే అర్ధమయి ఉంటుంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad