Home General ప్ర‌యాణిస్తున్న విమానంలో చిరుత పిల్ల‌..! అంద‌రూ షాక్‌..!

ప్ర‌యాణిస్తున్న విమానంలో చిరుత పిల్ల‌..! అంద‌రూ షాక్‌..!

ఆకాశంలోకి రివ్వున ఎగిరి మ‌నుషులు చేరాల్సిన చోటుకు చేర్చే విమానంలో ఇప్ప‌టి వ‌ర‌కు బంగారం స్మ‌గ్లింగ్ చేస్తుండ‌టాన్ని చూశాం. డ్ర‌గ్స్ కూడాను. కానీ, ఓ అప‌ర మేథావి ఆ రెండింటిని కాకుండా ఏకంగా చిరుత పిల్ల‌నే విమానం ఎక్కించేశాడు.

చిరుత పిల్ల‌ను విమానాన్ని ఎక్కించ‌డమంటే..! తాను తెచ్చుకున్న బ్యాగులో ఆ చిరుత పిల్ల‌ను కుక్కి మ‌రీ జిప్ వేశాడు. దీంతో ఆ చిరుత పిల్ల‌ కిక్కురుమ‌న‌కుండా ఉండ‌టంతో ఎయిర్ పోర్టు అధికారుల‌కు సైతం ఎటువంటి అనుమానాలు రాలేదు. ఈ సంఘ‌ట‌న చెన్నై ఎయిర్‌పోర్టులో వెలుగు చూసింది.

చెన్నై ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపిన వివ‌రాలిల మేర‌కు, థాయిల్యాండ్‌కు చెందిన ఓ ప్ర‌యాణికుడు తాను వెంట తెచ్చుకున్న ల‌గేజీ బ్యాగులో చిరుత పిల్ల‌ను ప్యాక్ చేసుకున్నాడు. ఎయిర్‌పోర్టులో క‌స్ట‌మ్స్ అధికారులు ల‌గేజీని చెక్ చేస్తున్న స‌మ‌యంలో బ్యాగులో నుంచి శ‌బ్దం రావ‌డంతో అనుమానం వ‌చ్చి ఓపెన్ చేసి చూశారు. బ్యాగులో క‌దులుతున్న చిరుత పిల్ల‌ను చూసి అధికారులంద‌రూ షాక్ అయ్యారు.

అప్ప‌టి వ‌ర‌కు బ్యాగు మూసేసి ఉండ‌టంతో గాలి ఆడ‌క చిరుత పిల్ల ఊపిరాడ‌ని ప‌రిస్థితిలో ఉంది. ఆ వెంట‌నే త‌మిళ‌నాడు అట‌వీశాఖ అదికారులకు స‌మాచారం ఇచ్చి వారికి అప్ప‌గించారు. చిరుత పిల్ల‌ను ర‌వాణా చేసిన ప్ర‌యాణికుడిపై వైల్డ్ లైఫ్ ప్రొటెక్ష‌న్ కింద చ‌ర్య‌లు తీసుకోనున్న‌ట్లు తెలిపారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad