సినీ నటుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు మోహన్‌బాబు తిరుపతి తిరుపతి – మదనపల్లి రోడ్డు పక్కనగల శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థల ఎదుట ధర్నాకు దిగారు. ఈ ధర్నాలో మంచు విష్ణు, మనోజ్‌తోపాటు విద్యా సంస్థలకు చెందిన వేలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలంటూ వారు డిమాండ్ చేస్తూ ధర్నాను కొనసాగించారు.
ఈ సందర్భంగా మోహన్‌బాబు మట్లాడుతూ చంద్రబాబు విద్యావిధానాలపైనే తమ నిరినసన కొనసాగుతుందన్నారు. చంద్రబాబు చేసిన పనులు చూస్తుంటే.. వైఎస్ఆర్ పాలనలోనే తమకు సంక్షేమ ఫలాలు అందాయన్న తెలుస్తుందన్నారు. తమ విద్యాసంస్థలకే చంద్రబాబు ప్రభుత్వం నుంచి రూ.20 కోట్లు బకాయిలు రావాల్సి ఉందన్నారు. తమ విద్యాసంస్థలకు రావాల్సిన ఫీజు రీయంబర్స్మెంట్ను పెండింగ్‌లో ఉంచారన్నారు.
చంద్రబాబు సర్కార్‌కు ఎన్నిసార్లు లేఖలు రాసినా పట్టించుకోలేదని మంచు మోహన్‌బాబు విమర్శించారు. విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం ఆడుకోవడం సమంజసం కాదన్నారు. ఆ క్రమంలోనే తమ విద్యా సంస్థల విద్యార్థులతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు.