Home Latest News వైఎస్ వివేకా హ‌త్య : సీఐ శంక‌ర‌య్య తీరుపై అనుమానాలు..!

వైఎస్ వివేకా హ‌త్య : సీఐ శంక‌ర‌య్య తీరుపై అనుమానాలు..!

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య మిస్ట‌రీ ఇంకా వీడ‌లేదు. హ‌త్య జ‌రిగి ప‌ది రోజులు కావ‌స్తున్నా పోలీసులకు ఎటువంటి ఆధారాలు ల‌భించ‌లేదు. దీంతో వివేకానంద‌రెడ్డిని ఎవ‌రు హ‌త్య చేశారు..? ఎందుకు హ‌త్య చేశారు..? అని అడుగుతున్నమీడియా ప్ర‌శ్న‌ల‌కు పోలీసుల వ‌ద్ద ఎటువంటి స‌మాధానం లేక‌పోయింది. పోలీసులు మాత్రం ఇప్ప‌టికే వివేకా హ‌త్య‌కు సంబంధించి ప‌లువురు అనుమానితుల‌ను అదుపులోకి తీసుకున్నామ‌ని, వారిని క్షుణ్ణంగా విచారిస్తున్నామ‌ని, అతి త్వ‌ర‌లో నిందితుల‌ను పట్టుకుంటామ‌ని ధీమాను వ్య‌క్తం చేస్తున్నారు.

ఇదిలా ఉండ‌గా, వివేకా కుమార్తె సునీత‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ హ‌త్య అనంత‌రం పులివెందుల సీఐ శంక‌ర‌య్య వ్య‌వ‌హార శైలిపై అనుమానాల‌ను వ్య‌క్తం చేశారు. వివేకా మృతి చెందాడ‌న్న షాక్‌లో త‌మ కుటుంబ స‌భ్యులు ఉన్నారు.. అదే స‌మ‌యంలో అక్క‌డ‌కు చేరుకున్న సీఐ శంక‌ర‌య్య‌కు మృత‌దేహాన్ని చూసి హ‌త్య అన్న అనుమానం రాలేదా..? అని ప్ర‌శ్నించారు. విధుల్లో ఉన్న సీఐ శంక‌ర‌య్య‌కు మృత‌దేహానికి శవ పంచ‌నామా చేయ‌కుండా క‌ట్లు క‌ట్ట‌కూడ‌ద‌ని తెలీదా..? శంవ‌పంచ‌నామా నిర్వ‌హించ‌కుండా డెడ్‌బాడీకి క‌ట్లు క‌ట్టి త‌ర‌లిస్తుంటే ఆపాల్సిన సీఐ శంక‌ర‌య్య అడ్డుకోక‌పోవ‌డం త‌మ‌కు అనుమానాల‌ను క‌లిగిస్తుంద‌ని సునీతారెడ్డి అన్నారు.

అయితే, వివేకా హ‌త్య జ‌రిగిన కొన్ని రోజుల‌కే సీఐ శంక‌రయ్య‌ను స‌స్పెండ్ చేస్తూ పోలీసు శాఖ ఉత్త‌ర్వులు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. సంఘ‌ట‌నా స్థ‌లంలో ఆధారాలను సేక‌రించ‌డంలో నిర్ల‌క్ష్యంగా ప్ర‌ద‌ర్శించిన కార‌ణంగా సీఐ శంక‌ర‌య్య‌ను స‌స్పెండ్ చేస్తూ డీఐజీ నాగేంద్ర‌కుమార్ ఆదేశాలు జారీ చేశారు. సునీతారెడ్డి సీఐ శంక‌ర‌య్య పాత్ర ఉందంటూ చేసిన ఆరోప‌ణ‌ల దృష్ట్యా ఆయ‌న్ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad