ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని, వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారని అరవింద్ అగోరి ఇటీవల ఓ ప్రముఖ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వంద రూపాయల బాండ్ పేపర్‌పై రాసిచ్చారు. గత ఐదేళ్లుగా ఏపీని పాలిస్తున్న చంద్రబాబు ఒకప్పుడు గుడ్ అడ్మినిస్ట్రేటర్‌గా ఉండేవారని, కానీ ఇప్పుడు ఆయన ఆ స్థానాన్ని కోల్పోయారని, దానికి ప్రధాన కారణం చంద్రబాబు ప్రాంప్ట్‌గా పాలిటిక్స్, అడ్మినిస్ట్రేట్ చేసి ఉండొచ్చని అరవింద అఘోరి తన అభిప్రాయాన్ని చెప్పారు.
చంద్రబాబు నాయుడు గతంలో ఒకటికి రెండు సార్లు బ్రేక్ వచ్చాయని, అటువంటి ఆయనకు ఇప్పుడు ఏమైందో ఏమో మరీ, మంచి పాలిటిక్స్, అడ్మినిస్ట్రేట్ గురించి బహుశా చంద్రబాబు మరిచిపోయి ఉండొచ్చన్నారు. ఏపీ అడ్మినిస్ట్రేట్లో ప్రస్తుతం అన్నీ అవకతవకలే జరుగుతున్నాయన్నారు. ఏ ప్రాంతానికి వెళ్లినా టీడీపీ గవర్నమెంట్‌పై ప్రజలంతా వ్యతిరేకతను కనబరుస్తున్నారని, అలాంటి పరిస్థితుల్లో ఎక్కువ మంది ప్రజలు జగన్‌వైపే మొగ్గు చూపుతున్నారన్నారు.