Home Latest News వైఎస్ జ‌గ‌నే కింగ్‌.. ట్రెండ్ సెట్ట‌ర్ కూడా : ప్రొ.నాగేశ్వ‌ర్‌

వైఎస్ జ‌గ‌నే కింగ్‌.. ట్రెండ్ సెట్ట‌ర్ కూడా : ప్రొ.నాగేశ్వ‌ర్‌

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ట్రెండ్ సెట్ట‌ర్‌గా నిలిచాడు. ఆయ‌నే కింగ్ అంటూ ప్ర‌ముఖ ప్రొఫెస‌ర్ నాగేశ్వ‌ర్ పేర్కొన్నారు. కాగా, ఇటీవ‌ల ఆయ‌న విడుద‌ల చేసిన ఓ వీడియోలో వైఎస్ జ‌గన్ గురించి ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను చెప్పుకొచ్చారు. వైఎస్ జ‌గ‌న్ ట్రెండ్ సెట్ట‌ర్ అంటూనే, అందుకు గ‌ల కార‌ణాల‌ను ప్రొ.నాగేశ్వ‌ర్ స్ప‌ష్టంగా వివ‌రించారు. అందుకు సంబంధించిన పూర్తి స‌మాచారం ఇలా ఉంది.

ఇదే స‌మ‌యంలో ప్రొ.నాగేశ్వ‌ర్ 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌రిగిన తీరును గుర్తు చేశారు. ప్ర‌త్యేక హోదా టార్గెట్‌గా నాడు ఎన్నిక‌లు జ‌రిగాయ‌ని, హోదా ఇచ్చే బాధ్య‌త త‌మ‌ద‌ని బీజేపీ, సాధించే బాధ్య‌త త‌మ‌దంటూ టీడీపీ ఇలా ఇద్ద‌రు కూడా ప్ర‌జ‌ల‌కు భ‌రోసా ఇవ్వ‌డంతోనే చంద్ర‌బాబు ఏపీ ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టార‌న్నారు.

కానీ, ఆ త‌రువాత చోటు చేసుకున్న రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వానికి వంత‌పాడిన చంద్ర‌బాబు ప్ర‌త్యేక హోదా ఏమ‌న్నా సంజీవ‌నా..? అంత‌కు మించిన ప్ర‌యోజ‌నాల‌తో కూడిన ప్యాకేజీని కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిందని, దాంతో ఏపీ అభివృద్ధి వేగ‌వంతం అవుతుందంటూ చంద్ర‌బాబు నాయుడు చెప్పుకొచ్చారు. చివ‌ర‌కు ఆ ప్యాకేజీ ఏపీ ప్ర‌భుత్వానికి అందిందో…? లేదో..? అన్న‌ది దేవుడికే ఎరుక‌.

ప్ర‌త్యేక హోదా అంశంతో బీజేపీతో చేతులు క‌లిపిన టీడీపీ, ఆ త‌రువాత అదే అంశాన్ని వ్య‌తిరేకిస్తూ కేంద్ర ప్ర‌భుత్వంలో కొన‌సాగింది. చివ‌ర‌కు బీజేపీ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేస్తూ ప్ర‌త్యేక హోదా, ప్యాకేజీ రెండింటిని సాధించ‌కుండానే బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. ఇలా ఏపీ ప్ర‌యోజ‌నాల‌ను కేంద్రం వ‌ద్ద తాక‌ట్టు పెట్టింద‌న్న విమ‌ర్శ‌ల‌ను టీడీపీ మూట‌గ‌ట్టుకుంది.

ఇదిలా ఉండ‌గా, ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్న వైఎస్ జ‌గ‌న్ మాత్రం రాష్ట్ర విభ‌జ‌న నాటి నుంచి ఏపీకి ప్ర‌త్యేక హోదా క‌ల్పించాలంటూ డిమాండ్ చేస్తూ నిరాహార దీక్ష‌లు, ఉద్య‌మాలు, ఆందోళ‌న‌లు, నిర‌స‌న‌లు చేస్తూ వ‌చ్చారు. ఇప్ప‌టికీ అదే మాట‌కు క‌ట్టుబ‌డి ఉన్నారు. ఇలా ఏపీకి సంబంధించిన అన్ని విష‌యాల్లోనూ జ‌గ‌న్ ఒక స్ప‌ష్ట‌మైన మాట‌పై నిల‌బ‌డి ఉంటాన్ని ఏపీ ప్ర‌జ‌లు గ‌మ‌నించి ఉన్నారు.

జ‌గ‌న్‌పై ప్ర‌జ‌ల్లో పెరుగుతున్న మ‌ద్ద‌తును గ‌మ‌నించిన చంద్ర‌బాబు మ‌ళ్లీ ప్ర‌త్యేక హోదా కావాలంటూ యూట‌ర్న్ తీసుకున్నారు. ఇలా వైఎస్ జ‌గన్ ట్రెండ్ సెట్ట‌ర్ ప్ర‌జ‌ల మ‌ధ్య‌న నిల‌వ‌గా, చంద్ర‌బాబు మాత్రం ఫాలోవ‌ర్‌గా గుర్తింప‌బ‌డ్డార‌ని ప్రొ.నాగేశ్వ‌ర్ త‌న విశ్లేష‌ణ‌లో చెప్పుకొచ్చారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad