Home Latest News ఏలూరు వేదిక‌గా ఎమ్మెల్సీని ప్ర‌క‌టించిన వైఎస్ జ‌గ‌న్‌..!

ఏలూరు వేదిక‌గా ఎమ్మెల్సీని ప్ర‌క‌టించిన వైఎస్ జ‌గ‌న్‌..!

వైఎస్ఆర్ కాంగ్రెస్‌ ఆధ్వ‌ర్యంలో ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా ఏలూరు వేదిక‌గా ఆదివారం జ‌రిగిన బీసీ గ‌ర్జ‌న స‌భ విజ‌య‌వంతంగా ముగిసింది. స‌భ‌లో పాల్గొన్నపార్టీ అధినేత, ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ బీసీ డిక్ల‌రేష‌న్ ప్ర‌క‌టించారు. వైసీపీ అధికారంలోకి వ‌స్తే బీసీల‌కు ఏడాదికి రూ.15వేల కోట్లు చొప్పున ఐదు సంవ‌త్స‌రాల్లోపు మొత్తం రూ.75వేల కోట్ల మేర ఖ‌ర్చు చేస్తామ‌ని వైఎస్ జ‌గ‌న్ తెలిపారు.

అలాగే, అసెంబ్లీలో బీసీ స‌బ్‌ప్లాన్‌ను ప్ర‌వేశ‌పెట్టి చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పిస్తామ‌న్నారు. బీసీల అభివృద్ధి కోసం మూడోవంతు నిధుల‌ను ఖ‌ర్చు చేసేలా ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తామ‌న్నారు. తొలి అసెబ్లీ స‌మావేశాల్లోనే బీసీ స‌బ్‌ప్లాన్‌కు చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పిస్తామ‌ని వైఎస్ జ‌గ‌న్ హామీ ఇచ్చారు. బీసీల‌తోపాటు రాష్ట్రంలోని ప్ర‌తి వ‌ర్గానికి ప్ర‌త్యేక కార్పొరేష‌న్ ఏర్పాటు చేసేందుకు వైసీపీ కృషి చేస్తుంద‌న్నారు.

వైఎస్ జ‌గ‌న్ ఇంకా మాట్లాడుతూ.. 45 ఏళ్లు నిండిన ప్ర‌తి బీసీ మ‌హిళ‌కు వైసీపీ చేయూత‌కింద రూ.75వేలు అందిస్తుంద‌న్నారు. హాస్ట‌ల్‌లో ఉండి చ‌దువుకునే ప్ర‌తి విద్యార్థికి ఏడాదికి రూ.20వేలు చొప్పున, పిల్ల‌ల‌ను బ‌డికి పంపించిన ప్ర‌తి త‌ల్లికి ప్ర‌తి ఏటా రూ.15వేలు చొప్పున అందిస్తామ‌న్నారు. అంతేకాకుండా, ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు ఉద్యోగాల్లో 50 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల‌కు వ‌చ్చేలా ప్ర‌త్యేక చ‌ట్టం తీసుకురావ‌డంతోపాటు నామినేటెడ్ ప‌ద‌వుల్లో బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీల‌కు 50 శాతం రిజ‌ర్వేషన్లు వ‌ర్తించేలా వైసీపీ అధికారంలోకి రాగానే చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని వైఎస్‌ జ‌గ‌న్ తెలిపారు.

వైసీపీ న‌వ‌ర‌త్నాల‌తో ప్ర‌తి పేద‌వాడి జీవితాలు మారుతాయ‌ని తాను న‌మ్ముతున్నాన‌ని, ప్ర‌తి పేద‌వాడి మొఖంలో చిరున‌వ్వు చూడాల‌న్న‌దే వైసీపీ ల‌క్ష్యం, ధ్యేయ‌మ‌న్నారు. అందుకు ఏపీ ప్ర‌జ‌ల ఆశీస్సులు కావాలని కోరారు. ఇదే స‌మ‌యంలో ఈ నెల 22వ తేదీన ఎమ్మెల్సీ నోటిఫికేష‌న్ వెలువ‌డ‌నుంద‌ని, వైఎస్ఆర్ కాంగ్రెస్‌కు ఉన్న ఒకే ఒక్క ఎమ్మెల్సీ సీటును జంగా కృష్ణ మూర్తికి ఇవ్వ‌బోతున్న‌ట్లు వైఎస్ జ‌గ‌న్ ప్ర‌క‌టించారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad