Home Latest News కోడిక‌త్తి ఘ‌ట‌న ముందు, త‌ర్వాత ఏం జ‌రిగిందో చెప్పిన జ‌గ‌న్‌..!

కోడిక‌త్తి ఘ‌ట‌న ముందు, త‌ర్వాత ఏం జ‌రిగిందో చెప్పిన జ‌గ‌న్‌..!

ఎవ‌రైనా తాము ప్రేమించే వ్య‌క్తిని చంపాల‌ని ప్ర‌య‌త్నిస్తారా.? చేయరు అటువంట‌ప్పుడు నా అభిమానే న‌న్ను చంపాల‌ని చూస్తాడా.?? అని ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చంద్ర‌బాబు నాయుడు స‌ర్కార్‌కు సూటి ప్ర‌శ్న వేశారు. కాగా, 2018లో చూసిన తెలుగు రాష్ట్రాల్లో వైర‌ల్ అయిన హాట్ టాపిక్‌ల‌లో జ‌గ‌న్‌పై హ‌త్యాయ‌త్నం ఒక‌టి. అయితే, వైఎస్ జ‌గ‌న్‌పై శ్రీ‌నివాస‌రావు అనే వ్య‌క్తి విశాఖ ఎయిర్‌పోర్టులో కోడిపందేల‌కు ఉప‌యోగించే క‌త్తితో హ‌త్యాయ‌త్నంకు య‌త్నించిన సంగ‌తి తెలిసిందే.

ఇదే విష‌య‌మై వైఎస్ జ‌గ‌న్ ఇటీవ‌ల ఓ ప్ర‌ముఖ ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో కూలంకుషంగా వివ‌రించారు. అంతేకాకుండా, త‌న‌పై హ‌త్యాయ‌త్నం జ‌రిగిన వెంట‌నే మాట్లాడ‌క‌పోవ‌డానికి గ‌ల కార‌ణాల‌ను కూడా చెప్పుకొచ్చారు. అవి జ‌గ‌న్ మాటల్లోనే.. హ‌త్యాయ‌త్నం జ‌రిగిన స‌మ‌యంలో ఐ బిహేవ్ లైక్ ఏ జెంటిల్‌మెన్ అంటూ చెప్పారు.

త‌న‌పై హ‌త్యాయ‌త్నం ఎవ‌రు చేశారో..? ఎందుకు చేశారో..? తెలియ‌ని ప‌రిస్థితి నాది. అటువంటి ప‌రిస్థితుల్లో నా నోటి నుంచి ఎటువంటి స్టేట్‌మెంట్ వ‌చ్చినా రాష్ట్రంలో అల్ల‌క‌ల్లోలం నెల‌కొనే ప‌రిస్థితి ఉంది. అందుకే, ఆ స‌మ‌యంలో శాంతి భ‌ద్ర‌త‌లు, ప్ర‌జ‌ల గురించి ఆలోచించే మాట్లాడ‌లేదు అని జ‌గ‌న్ చెప్పారు.

ఎయిర్‌పోర్టులో హ‌త్యాయ‌త్నం జ‌రిగింది నా ఒక్క‌డి ముందే కాదు. నా ప‌క్క‌న 30 మందికి పైగా ఉన్నారు. 30 మంది ఉన్న స‌మ‌యంలో జ‌రిగిన సంఘ‌ట‌న అది. శ్రీ‌నివాస‌రావు అనే వ్యక్తి నాపై కోడిక‌త్తితో దాడి చేసిన వెంట‌నే నా ష‌ర్టు బ‌ల్డ్‌తో కారుతూ ఉంటే.. నా ష‌ర్టును విప్పి ఎయిర్‌పోర్టు వైద్యులే ఫ‌స్ట్ ఎయిడ్ చేశారు. అక్క‌డే మ‌ళ్లీ కొత్త ష‌ర్టు వేసుకుని హైద‌రాబాద్ వ‌చ్చి హాస్పిట‌ల్‌లో ట్రీట్‌మెంట్ తీసుకున్నా. ఆ త‌రువాత వైద్యుల సూచ‌న‌ల మేర‌కు ఇంటికొచ్చి రెండువారాల‌పాటు రెస్ట్ తీసుకున్నానంటూ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చెప్పారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad