Home Latest News జ‌గ‌న్ పాద‌యాత్ర ముగిసినా.. వైసీపీ శ్రేణుల చూపు మాత్రం ఆ వైపే..!

జ‌గ‌న్ పాద‌యాత్ర ముగిసినా.. వైసీపీ శ్రేణుల చూపు మాత్రం ఆ వైపే..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర మ‌రికాసేప‌ట్లో ముగియ‌నుంది. అందుకు శ్రీ‌కాకులం జిల్లా ఇచ్చాపురం వేదిక కానుంది. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ముగియ‌నుండ‌టంతో అందుకు గుర్తుగా వైఎస్ జ‌గ‌న్ వైసీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన పైలాన్‌ను ఆవిష్క‌రించారు. కాగా, 2017 న‌వంబ‌ర్ 6న ప్ర‌జా సంక‌ల్ప యాత్ర పేరుతో పాద‌యాత్ర నిర్వ‌హించిన జ‌గ‌న్ అవిశ్రామంగా ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటూ ముందుకు క‌దిలారు.

  • అయితే, జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో హైలెట్స్ ఇలా ఉన్నాయి.
  • 14 నెల‌ల‌పాటు పాద‌యాత్ర‌గా ప్ర‌జ‌ల మ‌ధ్య‌నే జ‌గ‌న్.
  • 341 రోజులు 3648 కి.మీ ద‌గ్గ‌ర పాద‌యాత్ర పూర్తి.
  • 13 జిల్లాల్లో 2516 గ్రామాల మీదుగా ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌.
  • 231 మండ‌లాలు, 51 మున్సిపాలిటీలు , 8 కార్పొరేష‌న్ల‌లో పాద‌యాత్ర‌.
  • 134 నియోజ‌క‌వ‌ర్గాల్లో కొన‌సాగిన జ‌గ‌న్ పాద‌యాత్ర‌.
  • మొత్తం 55 ఆత్మీయ స‌మ్మేళ‌నాల్లో పాల్గొన్న వైఎస్ జ‌గ‌న్.
  • పాద‌యాత్ర‌లో భాగంగా 124 బ‌హిరంగ స‌భ‌లు.

ఇదిలా ఉండ‌గా, పాద‌యాత్ర ముగింపు సంద‌ర్భంగా వైసీపీ శ్రేణులు ఇచ్ఛాపురంలో ఏర్పాటు చేసిన విజయ సంక‌ల్ప స్ఫూపాన్ని జ‌గ‌న్ మ‌రికొద్ది సేపట్లో ఆవిష్క‌రించ‌నున్నారు. మ‌రో ప‌క్క జ‌గ‌న్ పాద‌యాత్ర విజ‌యోత్స‌వానికి ప్ర‌జ‌లు భారీ సంఖ్య‌లో త‌ర‌లి వ‌స్తున్నారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ మేమంతా వైఎస్ జ‌గ‌న్ జ‌య‌ప‌తాకం ఎగుర‌వేసే క్ష‌ణం కోసం తామంతా ఎదురు చూస్తున్నామ‌ని ఇచ్ఛాపురంకు చేరుకున్న వైసీపీ శ్రేణులతోపాటు ప్ర‌జ‌లు చెబుతున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad