Home Latest News వైఎస్ జ‌గ‌న్ పాద‌యాత్ర : ఒక్క రోజుకు రూ.50 ల‌క్ష‌ల వంతున ఖ‌ర్చు..!

వైఎస్ జ‌గ‌న్ పాద‌యాత్ర : ఒక్క రోజుకు రూ.50 ల‌క్ష‌ల వంతున ఖ‌ర్చు..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి దాదాపు 14 నెల‌ల‌పాటు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర పేరుతో నిర్వ‌హించిన పాద‌యాత్రకు ప్ర‌జ‌ల‌ను ర‌ప్పించేందుకు రోజుకు రూ.50 ల‌క్ష‌ల వంతున ఖర్చు చేశార‌ని రాష్ట్ర వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి విమ‌ర్శించారు.

కాగా, బుధ‌వారం నాడు పాద‌యాత్ర ముగింపు సంద‌ర్భంగా ఇచ్చాపురంలో వైసీపీ బ‌హిరంగ స‌భ నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. ఆ స‌భ‌లో పాల్గొన్న వైఎస్ జ‌గ‌న్ మాట్లాడుతూ.. ఒక్క‌సారి ఇవ్వండి, రాష్ట్రాన్ని 30 సంవ‌త్స‌రాల‌పాటు పాలించాల‌న్న‌దే నా కోరిక‌. నా పాల‌న‌లో రైతుల కంట క‌న్నీరు రాకుండా చూసుకుంటా, రైతుకు అవ‌స‌ర‌మైన ప్రాజెక్టుల‌న్నింటిని యుద్ధ ప్రాతిప‌దిక‌న పూర్తి చేసేందుకు కృషి చేస్తానంటూ వైఎస్ జ‌గ‌న్ చెప్పిన విష‌యం విధిత‌మే.

వైఎస్ జ‌గ‌న్ చెప్పిన ఆ వ్యాఖ్య‌ల‌నే ఆధారంగా చేసుకుని మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి ఇవాళ మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. మంత్రి మాట్లాడుతూ.. మీరు పాద‌యాత్ర చేసింది 300 చిల్ల‌ర రోజులు, మీరు న‌డిచింది 3680 కిలోమీట‌ర్లు న‌డించారు. ఆ స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌ను ర‌ప్పించేందుకు, 300 చిల్ల‌ర రోజుల్లో రోజుకు రూ.50 ల‌క్ష‌ల వంతున ఖ‌ర్చు పెట్టింది నిజం కాదా.? వైసీపీ ఎమ్మెల్యే టికెట్ల‌ను అమ్మిన డ‌బ్బుతోనే నీవు పాద‌యాత్ర చేసిన మాట నిజం కాదా..? ? అంటూ జ‌గ‌న్‌ను ప్ర‌శ్నించారు.

మీరు చేసే కుట్ర‌లు తెలియ‌ని కొంద‌రు నాయ‌కులు, నేత‌లు వైసీపీలో చేరేందుకు వ‌స్తే వారిని కూడా కోట్లు రూపాయ‌లు తెమ్మంటూ వైఎస్ జ‌గ‌న్ వేధించార‌ని, అలాంటి జ‌గ‌న్‌ వైసీపీ బ‌హిరంగ స‌భ‌లో డ‌బ్బు మీద ఆశ‌లేదంటూ చెప్ప‌డం హాస్యాస్పంద‌మ‌ని సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి ఎద్దేవ చేశారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad