Home Election Results - 2019 మోడీకి అమిత్ షాలా.. జ‌గ‌న్‌కు ఎవ‌రో తెలుసా..?

మోడీకి అమిత్ షాలా.. జ‌గ‌న్‌కు ఎవ‌రో తెలుసా..?

ఈ నెల 30న ఏపీ ముఖ్య‌మంత్రిగా వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి బాధ్య‌త‌లు స్వీక‌రించ‌నున్ననేప‌థ్యంలో ఆయ‌న‌కు అత్యంత స‌న్నిహితుడిగా ఉన్న మిథున్ రెడ్డి పేరు ఇప్పుడు అటు వైసీపీలోను, ఇటు ఏపీ రాజ‌కీయాల్లోను హాట్‌టాపిక్‌గా మారింది.

ఈ నెల 23న వెలువ‌డిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాల నాటి నుంచి రాజంపేట పార్ల‌మెంట్ స‌భ్యుడు మిథున్‌రెడ్డి వైఎస్ జ‌గ‌న్‌కు వెన్నంటి ఉంటూ వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. అందుకు ప్ర‌ధాన కార‌ణం జ‌గ‌న్‌కు, మిథున్‌రెడ్డికి మ‌ధ్య ఉన్న రాజ‌కీయ సంబంధ‌మే అన్న విష‌యం తెలిసిందే.

అంతేకాకుండా చిత్తూరు జిల్లా వైసీపీలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించే పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి కుమారుడైన మిథున్‌రెడ్డికి, జ‌గ‌న్‌కు మ‌ధ్య ఉన్న స్నేహ బంధం ఈనాటిది కాద‌ని, గ‌త రెండు ద‌శాబ్దాల కాలంగా వారిద్ద‌రూ మంచి స్నేహితులుగా మంచి సంబంధాల‌ను క‌లిగి ఉన్నారు.

ఇలా జ‌గ‌న్‌కు, మిథున్‌రెడ్డికి మ‌ధ్య ఉన్న సంబంధం కార‌ణంగానే మిథున్‌రెడ్డి తండ్రి పెద్దిరెడ్డికి వైఎస్ఆర్ హ‌యాంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో కీల‌క ప‌ద‌వి అప్ప‌చెప్పాలంటూ జ‌గ‌న్ ఒత్తిడి తెచ్చార‌ని కూడా రాజ‌కీయ విశ్లేష‌కుల స‌మాచారం. దీంతో చిత్తూరు జిల్లా నుంచి నాడు న‌ల్లారి కిర‌ణ్ కుమార్ రెడ్డికి ప్రాధాన్య‌త క‌ల్పించాల్సి వ‌చ్చింది.

ఆ త‌రువాత రోజుల్లో జ‌గ‌న్‌కు ఇచ్చిన మాట ప్ర‌కారం వైఎస్ఆర్ పెద్దిరెడ్డికి కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌చెప్పార‌న్న‌ది స‌మాచారం. నాటి నుంచి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి కుటుంబం.. కుటుంబం వైఎస్ ఫ్యామిలీకి న‌మ్మిన బంటులా వ్య‌వ‌హ‌రిస్తూ వ‌చ్చింది.

వైఎస్ఆర్ మ‌ర‌ణానంత‌రం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి కాంగ్రెస్ నుంచి బ‌య‌ట‌కు రావ‌డంతో, పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి కుటుంబం సైతం జ‌గ‌న్‌కు అండ‌గా ఆ పార్టీకి రాజీనామా చేసి బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. ఆ త‌రువాత వైసీసీన‌ స్థాపించిన జ‌గ‌న్.., పార్టీ క‌ష్ట‌కాలం తొమ్మిదేళ్లూ జ‌గ‌న్‌కు అండ‌గా ఉంటూ వ‌చ్చారు. ఆఖ‌ర‌కు ప్ర‌జా సంక్షేమ‌మే ధ్యేయంగా, అధికారంలోకి రావ‌డం కోసం జ‌గ‌న్ నిర్వ‌హించిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర పాద‌యాత్ర‌కు పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి కుటుంబ‌మే ఖ‌ర్చుల‌ను భ‌రించిన‌ట్టు టాక్‌. ఇలా అటు ఫ్యామిలీ ప‌రంగాను, ఇటు రాజ‌కీయాల‌ప‌రంగాను మిథున్‌రెడ్డికి వైఎస్ జ‌గ‌న్ టాప్ ప్ర‌యారిటీ ఇస్తార‌న్న వాద‌న రాజ‌కీయ విశ్లేష‌కుల నుంచి వినిపిస్తోంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad