Home Latest News వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావడం చారిత్రాత్మ‌క‌ అవసరం

వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావడం చారిత్రాత్మ‌క‌ అవసరం

నేడు రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని, అంతం చేయాల్సిన బాధ్యత వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ప్రతి కార్యకర్తపై ఉందని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. ఆదివారం కర్నూలు జిల్లా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ కార్యాలయంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంట్‌ అధ్యక్షుడు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, అనుబంద సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు.

విజయసాయిరెడ్డి మాట్లాడుతూ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేసేందుకు పార్టీ శ్రేణులంతా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అధికారం తెలుగుదేశం పార్టీ చేస్తున్న అరాచకాలను క్రిందిస్థాయి వరకు తీసుకవెళ్లి ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ప్రజా వ్యతిరేక విధానాల ను పాలన చేస్తున్న టిడిపి ప్రభుత్వ విధానాలను ప్రజలకు తెలియజేయడమే కాకుండా వైసిపి ప్రవేశపెట్టిన నవరత్నాల వంటి పథకాల ద్వారా ప్రజలకు ఎలాంటి లబ్ధి చేకూరుతుందో ప్రజలకు అర్థమయ్యేలా వివరించాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులకు ఉందన్నారు.

అలాగే అధికార పార్టీ నేతలు, ఓటర్ల జాబితాలో అనేక అవకతవకలకు పాల్పడుతున్నారని అందువల్ల ఎప్పటికప్పుడు బూత్‌ కమిటీలు తమ పరిశీలనలలోని ఓటర్ల జాబితాలో మార్పులు గమనించి పార్టీ సానుభూతిపరుల ఓట్లు గల్లంతు కాకుండా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా రీజినల్‌ కోఆర్డినేటర్‌ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ కర్నూలు జిల్లా రీజినల్‌ కోఆర్డినేటర్‌గా తనను ఎంపిక చేయడం పై వైయస్‌జగన్మోహన్‌రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు.

రానున్న ఎన్నికలలో రెండు లోక్‌సభ స్థానాలతో పాటు 14 అసెంబ్లీ సీట్లను గెలిచి తీరుతామన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. అనంతరం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నంద్యాల, కర్నూలు పార్లమెంట్‌ అధ్యక్షులు శిల్పా చక్రపాణిరెడ్డి, బివై రామయ్య పార్టీ శ్రేణులకు దిశ నిర్దేశం చేశారు. ఈ సమావేశంలో ఎంఎల్‌సి గంగుల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సాయి ప్రసాద్‌రెడ్డి, గుమ్మనూరు జయరాం, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, గౌరుచరితారెడ్డి, ఐజయ్యతో పాటు మాజీ ఎమ్మెల్యేలు కాటసాని రామిరెడ్డి, కాటసాని రాంభూపాల్‌రెడ్డి, నియోజక వర్గ ఇన్‌ఛార్జీలు హఫీజ్‌ఖాన్‌, శిల్పా రవికిశోర్‌రెడ్డి, తెర్నకల్‌ సురేంద్రర్‌రెడ్డి, రాజావిష్ణువర్థన్‌రెడ్డి, గంగులనాని, కోనేటి వెంకటేశ్వర్లు, మద్దయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad