వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కాసేపటి క్రితం రేణుగుంటకు చేరుకున్నారు. తిరుమల యాత్రలో భాగంగా వైఎస్ జగన్ హౌరా – యశ్వంత్ పూర్ ఎక్స్ప్రెస్లో రేణిగుంటకు చేరుకున్నారు. ఇవాళ మధ్యాహ్నం సమయంలో తిరుమలలో వెలసిన, ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకోనున్నారు.
అయితే, ప్రజా సమస్యలను స్వయంగా తెలుసుకునే క్రమంలో వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర పేరుతో నిర్వహించిన పాదయాత్ర బుధవారం వారంతో ముగించిన సంగతి తెలిసిందే. దాదాపు 14 నెలల సుదీర్ఘ పాదయాత్రలో 341 రోజులు 3648 కి.మీ దగ్గర జగన్ తన పాదయాత్ర పూర్తి చేశారు. 13 జిల్లాల్లో 2516 గ్రామాల మీదుగా ప్రజా సంకల్ప యాత్ర కొనసాగింది. 231 మండలాలు, 51 మున్సిపాలిటీలు , 8 కార్పొరేషన్లలో జగన్ పర్యటించారు.