జగన్కు వెన్నుదన్నుగా, మొదటినుంచీ కాపుకాస్తోన్న విజయసాయిరెడ్డికి సీఎం వైఎస్ జగన్ బంపరాఫర్ ఇచ్చారు. ఇప్పటికే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ ఎంపీని చేసి పార్లమెంటుకు పంపించిన ఆయన ఇప్పుడు ఏకంగా ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా విజయసాయి రెడ్డిని నియమిస్తున్నట్లు ప్రకటించారు.
కాసేపటిక్రితం (శనివారం సాయంత్రం) ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా విజయసాయి రెడ్డిని నియమిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో ఇక విజయసాయికు కేబినెట్ మంత్రి హోదా ఉన్నట్లే. ఇందుకు సంబంధించిన ఉత్వర్వులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం జారీ చేశారు. తక్షణమే ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది.
జగన్ తోపాటు పలు కేసులకు సంబంధించి విజయసాయికూడా అప్పట్లో జైలులో ఉన్న సంగతి తెలిసిందే.