Home Latest News ఇత‌ర రాష్ట్రాల్లో వైఎస్ జ‌గ‌న్ ఎన్నిక‌ల‌ ప్ర‌చారం..!?

ఇత‌ర రాష్ట్రాల్లో వైఎస్ జ‌గ‌న్ ఎన్నిక‌ల‌ ప్ర‌చారం..!?

ఏప్రిల్ 11న ముగిసిన ఏపీ సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో విజ‌యం త‌మ‌దంటే.. త‌మ‌ద‌ని ప్ర‌ధాన పార్టీలు టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులు ఎవ‌రికి వారు ధీమాను వ్య‌క్తం చేస్తున్నారు. ఎన్నిక‌ల సందర్భంగా ఈవీఎంల స‌మ‌స్య త‌లెత్తినా ఓటేసే వెళ్తామంటూ మ‌హిళ‌లు పోలింగ్ కేంద్రాల వ‌ద్ద బారులు తీరార‌ని, వారి ఓట్ల‌న్నీ త‌మ ఖాతాలోకే క‌నుక త‌మ పార్టీ విజ‌యం ఖాయ‌మ‌ని టీడీపీ చెబుతుంటే.. అవ‌న్నీ ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓట్లేగ‌నుక ప్రధాన ప్ర‌త్య‌ర్ధిగా ఉన్న త‌మ పార్టీ ఖాతాలోకేనంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులు పేర్కొంటున్నారు. ఇలా పార్టీల అధినేత‌లు కార్య‌క‌ర్త‌ల్లో మ‌నో ధైర్యాన్ని నింపుతున్నారు.

ఇదిలా ఉండగా, ఇటీవ‌ల వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాజ‌కీయాల్లో 40 ఇండ‌స్ట్రీ అని చెప్పుకుంటున్న చంద్ర‌బాబు ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ప్ర‌జ‌లు తీర్పునిస్తే.. అది ఈవీఎం మిష‌న్‌ల లోప‌మ‌ని, టీడీపీకి ఓటేస్తే వైసీపీకి ప‌డుతుంద‌ని చెప్ప‌డం సిగ్గుచేట‌ని విమ‌ర్శించిన సంగ‌తి తెలిసిందే. అంతేకాక‌, ఓట‌మి భ‌యంతో ఉన్న చంద్ర‌బాబు పోలింగ్‌ను అడ్డుకోవాల‌ని ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా ప్ర‌జ‌లు వాటిని తిప్పికొట్టార‌ని చెప్పారు.

అదే సంద‌ర్భంలో చంద్ర‌బాబుకు తెలంగాణ సీఎం కేసీఆర్ రిట‌ర్న్ గిఫ్ట్ ఇస్తాన‌న్నారు క‌దా…! దానిపై మీ స్పంద‌న అని ఓ మీడియా ప్ర‌తినిధి అడ‌గ్గా, స్పందించిన జ‌గ‌న్ అది చంద్ర‌బాబు, కేసీఆర్‌కు సంబంధించిన ఇష్ట్యూ, ఆ ఇష్ట్యూతో త‌న‌కు ఎటువంటి సంబంధం లేద‌న్నారు. ఏపీలో పోలింగ్ ముగిసింది క‌దా..! ఇత‌ర రాష్ట్రాల్లోని పార్టీల‌కు మ‌ద్ద‌తుగా ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించే అవ‌కాశం ఉందా..? అని మ‌రో విలేక‌రి అడ‌గ్గా, అటువంటి ఆలోచ‌న త‌న‌కు లేద‌ని, ఫ్యామిలీతో గ‌డ‌పాలి.. ఐ విల్ టేక్ హాలిడే అంటూ జ‌గ‌న్ త‌న‌దైన శైలిలో స‌మాధానం చెప్పారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad