కలిసి ఫోటోలు దిగినంత మాత్రాన పాండ్యాకు, నాకు మధ్య అక్రమ సంబంధాన్ని అంటగడతారా.? అసలు ఇలాంటి ఐడియాలు మీకెలా వస్తాయి..? ఇక ముందైనా ఇటువంటి వార్తలు రాసే ముందు కాస్తైనై మనుషుల్లా ప్రవర్తించండి అంటూ బాలీవుడ్ హాట్ భామ ఎల్లీ అవ్రామ్ మీడియా ప్రతినిధులపై మండిపడింది. తాను స్వీడన్ నుంచి బాలీవుడ్‌కు వచ్చింది హీరోలతో, ప్రముఖులతో రాసుకుపూసుకు తిరిగేందుకు కాదని, నాకంటూ మంచి గుర్తింపు తెచ్చుకునేందుకే బాలీవుడ్లో నటిగా అడుగుపెట్టినట్టు ఎల్లీ అవ్రామ్ తెలిపింది.
కాగా, ఎల్లీ అవ్రామ్‌కు, భారత క్రికెట్ ఆల్ రౌండర్ హార్దిక్ ప్యాండ్యాకు మధ్య గత కాలంగా సహజీవనం చేస్తున్నారని, వారి సహజీవనం పెళ్లికి దారి తీయబోతుందని, అందుకు డేట్ కూడా ఫిక్స్ అయిందని ఇటీవల కథనాలు వెలువడిన సంగతి తెలిసిందే. అలా సహజీవనం అంటూ వస్తున్న వార్తలపై ఎల్లీ బ్యూటీ స్పందించింది.
అయితే, గతంలో కృనాల్ పాండ్యా పెళ్లి సందర్భంగా హార్దిక్ పాండ్యా, ఎల్లీ బ్యూటీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కొంతకాలంపాటు కలిసి చెట్టాపట్టాలేసుకు తిరిగిన ఈ జంట కొన్ని రోజులుగా దూరంటా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ ఇద్దరు మళ్లీ కలిశారు. త్వరలోనే పెళ్లి అంటూ ఎల్లీ అవ్రామ్, హార్దిక్ పాండ్యాలను ఉద్దేశిస్తూ కథనాలు వెలువడటంతో ఎల్లీ పై విధంగా మీడియాపై ఫైరైంది.