మరో రెండు నెలల్లో ఏపీ వ్యాప్తంగా జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసి.. పోటీ చేసిన అన్ని నియోజకవర్గాల్లోనూ విజయం సాధిస్తుందని టీడీపీకి రాజీనామా చేసి అమలాపురం ఎంపీ రవీంద్ర బాబు అన్నారు. కాగా, ఇవాళ ఆయన వైసీపీ అధిష్టానం నిర్ణయం మేరకు తన ఎంపీ పదవికి, టీడీపీకి రాజీనామా చేసి జగన్ సమక్షంలో వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయినందునే సీఎం చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌ను వదిలి విజయవాడకు పారిపోయారన్నారు. కేవలం చంద్రబాబు చేతకాని తనం వల్లే ఏపీకి రావాల్సిన ప్రత్యేక హోదా, ప్యాకేజీ రాలేదన్నారు. ప్రత్యేక హోదాను నీరుగార్చిన వ్యక్తుల్లో సీఎం చంద్రబాబు మొట్ట మొదటి వ్యక్తని, ఏపీ ప్రజల్లో మొదటి ముద్దాయిగా చంద్రబాబు ఉంటారన్నారు. మాట తప్పని.. మడమ తిప్పని వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని రవీంద్ర బాబు తెలిపారు.