Home Latest News బాపట్ల బాద్‌ షా ఎవరో?

బాపట్ల బాద్‌ షా ఎవరో?

ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ గుంటూరు జిల్లా బాపట్ల రాజకీయం రసవత్తరంగా మారింది. మరోసారి వైసీపీ తరుపున సిట్టింగ్‌ ఎమ్మెల్యే కోన రఘుపతి బరిలో ఉండగా టీడీపీ తరపున ఆశావాహుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. బాపట్లకి ఎడ్యుకేషనల్‌ హబ్‌గా తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు ఉంది. ఇక్కడ ఓటరు నాడి కనిపెట్టడం చాలా కష్టంగా ఉంటుంది. ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో ఇక్కడ నుంచి గెలుపొందిన పార్టీ రాష్ట్రంలో అధికారం చేపడుతుందనే సెంటిమెంట్‌ కూడా ఉండేది.

అయితే గత సార్వత్రిక ఎన్నికల్లో ఇది తారుమారు కావడం గమనార్హం. గుంటూరు, ప్రభన్యూస్‌ బ్యూరో, : రాజకీయంగా, సామాజిక స్పృహ కలిగిన జిల్లాలోనే బాపట్ల నియోజకవర్గం మొదటి స్థానంలో ఉంటుందంటే అతిశయోక్తిలేదు. బాపట్ల, కర్లపాలెం, పిట్టలవానిపాలెం మూడు మండలాలు కలిపి 2 లక్షల 4 వేలకు పైగా ఓటర్లు ఉన్నారు. ఒకప్పుడు టీడీపీ కంచుకోటగా ఉన్న బాపట్ల గత మూడు పర్యాయాల నుంచి ఓటమి ఎదుర్కొంటుంది. రెండు పర్యాయాలు కాంగ్రెస్‌ విజయం సాధించగా 2014లో వైసీపీ అభ్యర్థి కోన రఘుపతి విజయం సాధించారు.

నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గం 33 వేలకు పైగా ఉండగా, ఎస్సీ 40 వేలు, బీసీ 40 వేలు, కాపు 14 వేలు, మైనార్టీలు 15 వేలతో పాటు ఇతర సామాజికవర్గాలు ఉన్నాయి. 2004 ఎన్నికల్లో గాదె వెంకటరెడ్డి బాపట్ల ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత ఇక్కడ రాజకీయ, సామాజిక సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. దీంతో 2009 మరోసారి ఇక్కడ ప్రజలు గాదెను గద్దె ఎక్కించారు. 2014 రాష్ట్ర విభజన తర్వాత అనేక పరిణామాల నేపధ్యంలో వైపీపీ వైపు ప్రజలు మొగ్గు చూపారు.

అయితే ఈసారి ఎట్టి పరిస్థితుల్లోను టీడీపీ జెండాను ఎగరవేసేలా నాయకులు ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నారు. అభ్యర్థులలో పోటీ కూడా తీవ్రంగా ఉండడంతో ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. ప్రస్తుత ఇన్‌చార్జ్‌గా ఉన్న అన్నం సతీష్‌ మరోసారి అవకాశం కల్పించాలని అధిష్టానాన్ని కోరుతుండగా, పారిశ్రామిక వేత్త వేగేశన నరేంద్రవర్మ సీటు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే గాదె వెంకటరెడ్డి తన కుమారుడు గాదె మధుసూదన్‌రెడ్డికిబాపట్ల సీటు కేటాయించాలని అధిష్టానాన్ని కోరుతున్నారు.

ఈ ముగ్గురిల్లోనే సీటు ఉంటుందనే ప్రచారం కూడా సాగుతోంది. ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న కోన రఘుపతిపై రెడ్డి సామాజికవర్గం కొంచెం గుర్రుగా ఉంది. నియోజకవర్గంలో బలమైన సామాజికవర్గమైన రెడ్డి సామాజికవర్గానికి కేటాయించాలనేది వారి డిమాండ్‌. దీనికి అధిష్టానం వ్యతిరేకించడం తెలుగుదేశం పార్టీకి ఇక్కడ కలసి వస్తుందనేది నియోజకవర్గంలో ప్రజలు చెబుతున్నారు.

ఈ పరిస్థితుల్లో జనసేన పార్టీ పోటీ ఇక్కడ రెండు పార్టీల్లో కలవరం పుట్టిస్తోంది. జనసేన పార్టీ లక్ష్యాలు, పార్టీ అధినేత పవన్‌ ప్రసంగాలు, సోషల్‌ మీడియా ప్రచారాలు ఇక్కడ ప్రజలను ఆకర్షణకు గురి చేస్తున్నాయి. విద్యా కేంద్రంగా ఉన్న నియోజకవర్గంలో జనసేన బలం రోజురోజుకు పెరుగుతోంది. బీసీ సామాజిక వర్గానికి ఇక్కడ సీటు కేటాయిస్తే త్రిముఖ పోటీ బలంగా ఉంటుందనే వాదన వినిపిస్తుంది. ఇప్పటివరకు ఇక్కడ త్రిముఖ పోటీలో మాత్రమే టీడీపీ విజయం సాధించడం ఒక సెంటిమెంట్‌గా మారింది. ఈ నేపధ్యంలో పోరు రసవత్తరం కానుంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad